• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉండి నూతన వీ‌ఆర్‌ఓ‌ల సంఘం ఎన్నిక

W.G: ఉండి మండలం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఉండి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎన్నిక జరిగిట్టు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు S.చిన్నారావు తెలిపారు.ఆయన కార్యవర్గ వివరాలుఅందజేశారు.ఉపాధక్షులుగాD.వెంకటేశ్వర్ల,కా ర్యదర్శిగా CH. విజయలక్ష్మి , సంయుక్త కార్యదర్శిగా V. D. కృపాంజలి , కోశాధికారీగా B. శ్రీనివాసరావు ఎన్నికైనట్టు తెలిపారు.

February 24, 2026 / 05:47 PM IST

రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలి: శ్రీరామ్

సత్యసాయి: రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రెసిడెంట్, డైరెక్టర్లకు ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ సూచించారు. తాడిమర్రి పీఏసీఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు బసికొండ రవీంద్ర, నాగార్జున రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం పరిటాల శ్రీరామ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 05:46 PM IST

లెజిస్టేటివ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

AP: విజయవాడలో లెజిస్టేటివ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, డీఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో పోటీలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మొత్తం మూడురోజుల పాటు 14 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. 

February 24, 2026 / 05:46 PM IST

సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలన

NRML: మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజుర సత్యం అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు.

February 24, 2026 / 05:45 PM IST

టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్ష

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం త్వరలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి భాగస్వామ్యం పంచుకున్నారు.

February 24, 2026 / 05:45 PM IST

ఫ్రూట్ జామ్ వాడుతున్నారా?

బ్రెడ్ మీద ఫ్రూట్ జామ్ రాసుకుని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మార్కెట్‌లో దొరికే చాలా జామ్‌లలో పండ్ల శాతం కంటే పంచదార, కృత్రిమ రంగులే ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటికి బదులుగా ప్రొటీన్ ఉండే పీనట్ బటర్ లేదా ఇంట్లో తాజాగా చేసుకున్న చట్నీలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

February 24, 2026 / 05:45 PM IST

జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన అరకు విద్యార్ధిని

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2nd B.Com విద్యార్థిని తామల జ్యోతిక జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చలపతిరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జ్యోతికను సత్కరించారు. ఈనెల 17, 18 తేదీలలో రాంచిలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో జ్యోతిక జావెలిన్‌త్రో విభాగంలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించింది.

February 24, 2026 / 05:43 PM IST

భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన మాదక ద్రవ్యాలను సురక్షితంగా భద్రపర్చేందుకు పాత కలెక్టర్ కార్యాలయం నందు ఉన్న భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. గిరింపేటలో ఉన్న పాత కలెక్టరేట్లో టౌన్ ప్లానింగ్ విభాగంలోని హాలును పరిశీలించారు. భవనంలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

February 24, 2026 / 05:43 PM IST

మహిళా దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన కమిషనర్

RR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోస్టర్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, డీఆర్‌వో సంగీత ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని RR జిల్లాలోని మహిళా ఉద్యోగులకు మార్చి 4న హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని RR జిల్లా టీజీవో అధ్యక్షులు డాక్టర్ రామారావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి మహిళలకు ప్రత్యేక అనుమతి ఇప్పించాలన్నారు.

February 24, 2026 / 05:42 PM IST

హనుమాన్ దేవాలయ నిర్మాణానికి కౌన్సిలర్ చేయూత

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27 డివిజన్లో కౌన్సిలర్ తేజస్విని మంగళవారం కాలనీలలో పర్యటించారు. కౌన్సిలర్ వెంట మున్సిపాలిటీ అధికారులు, కాలనీ పెద్దలు ఇంటింటికి వెళ్లి సమస్యల తీవ్రతపై దరఖాస్తులను స్వీకరించారు. గత ఎన్నికల ముందు కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు హనుమాన్ దేవాలయ నిర్మాణంకు అవసరమైన మెటీరియల్‌ను పాలకమండలి సభ్యులకు అందజేశారు.

February 24, 2026 / 05:41 PM IST

తప్పిదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

RR: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారుల ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుంచి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయలన్నారు.

February 24, 2026 / 05:41 PM IST

మర్రిపాడులో ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి జాతర

SKLM: సంతబొమ్మాలి మండలం మర్రిపాడులో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఈ యాత్ర మంగళవారం నుండి గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గురువారం అమ్మవారు ఎల్లమ్మ తల్లి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. నౌపడ ఎస్సై నారాయణస్వామి జాతరకి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

February 24, 2026 / 05:38 PM IST

దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుల సతీమణి మృతి

కృష్ణా: జిల్లా ఆదిమాంద్ర సంఘం అధ్యక్షులు, దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు పొంగులేటి జయరాజు సతీమణి విజయలక్ష్మి మంగళవారం మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి, నేడు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి మరణంతో, జయరాజుకు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, దళిత సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

February 24, 2026 / 05:37 PM IST

‘పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి’

ASF: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. సమావేశంలో DIEO, DEO తదితర అధికారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:37 PM IST

భారత జట్టులో ‘కోల్డ్ వార్’ నడుస్తోందా..?

పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అతడు ఆరోపించాడు. ఆ కారణంతోనే కుల్దీప్‌ను సూర్య జట్టు నుంచి తొలగించినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి మధ్య ఉన్న విభేదాలు మైదానంలో బహిరంగంగానే బయటపడ్డాయని షెహజాద్ వ్యాఖ్యానించాడు.

February 24, 2026 / 05:37 PM IST