MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ ప్రాంతాలు వస్తాయి. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం తార్నాకలోని HMDA భవనంలో అందుబాటులో ఉంది. కమిషనర్ అధికారి, ఇతర అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. కిందిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే డైరెక్ట్ కమిషనర్ కార్యాలయానికి రావాలన్నారు.
PPM: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్ నియామకం అంటే డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నెల్లూరు: చేజర్ల మండలం ఆదురుపల్లిలో గురువారం చేజర్ల ఎస్సై తిరుమలరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు చలానాలు విధించి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.
VZM: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి మార్చి 1న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. ఉషారాణి తెలిపారు. 1న ఆదివారం 5వ తరగతికి ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకూ అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ 12 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలు వరకూ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
BPT: యద్దనపూడి మండలంలోని అనంతవరం ఎస్టీ కాలనీలో గురువారం ఎస్సై రత్నకుమారి ఆధ్వర్యంలో పోలీసులు ‘కార్డెన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, అనుమానాస్పద వ్యక్తుల కదలికల నివారణకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై స్పష్టం చేశారు.
TG: గత పదేళ్ల BRS పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై KTR, హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో గత పాలకులు జేబులు నింపుకున్నారని, 1.08 లక్షల కోట్లు ఖర్చు చేసినా కేవలం 110TMCలే అందుబాటులోకి వచ్చాయని విమర్శించారు. ఎనిమిదో వింతగా చెప్పుకున్న ప్రాజెక్టు పేక మేడలా కూలిపోయిందని ఎద్దేవా చేశారు.
SKLM: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం అమలులోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, సంచార వాహనాన్ని ప్రారంభించారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు ఉన్నారు.
E.G: సీఎం చంద్రబాబు గురువారం అమరావతి నుంచి తూ.గో, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలులతో కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం క్షేత్ర స్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తత కలిగి ఉండాలన్నారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు.
MNCL: గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి పేర్కొన్నారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్పేయర్లు, మూడు రోటవేటర్‌లను మండల వ్యవసాయధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం వ్యవసాయం ప్రోత్సహించడానికి సబ్సిడీ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
BHNG: పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జూకంటి బాబు ఫౌండేషన్ అధ్యక్షులు జూకంటి బాబు తెలిపారు. గురువారం ఆలేరు మండలం టంగుటూరు గ్రామం ఎలగందుల రాజ్యలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాలుగు ఆకర్షణీయమైన రంగులతో కూడిన యూనిఫామ్‌లను ఆయన అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
PLD: శాసనసభ సందర్శనలో భాగంగా ఈపూరు మండలం బొగ్గరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం అసెంబ్లీకి విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సాదరంగా స్వాగతం పలికి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చలు ఎలా జరుగుతాయో వివరించిన ఆయన, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
KDP: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్స్‌పై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని స్కూల్స్‌లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుభవం లేని బోధకులు ఉండడం, ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన కల్పించకపోవడం జరుగుతోందని ఆరోపించారు.
ADB: శాంతి భద్రతల పరిరక్షణలో రూరల్ SI విష్ణువర్ధన్ పాత్ర కీలకం అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, క్రీడారంగంలో అభివృద్ధి చెందడానికి విష్ణువర్ధన్ సేవలు మరువలేనివని అన్నారు. ఈ మేరకు మహిళా క్రీడాకారులకు ఆర్చరీ కిట్లు, ఎనిమిది మంది క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ SP అఖిల్ మహాజన్ చేతుల మీదుగా గురువారం అందజేశారు.