కృష్ణా: మచిలీపట్నం–పెడన NH216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు బుధవారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించి, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు తక్షణమే నంబర్ ప్లేట్లు అమర్చేలా చర్యలు తీసుకున్నారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స పద్ధతిలో తొలిసారి ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, నేడు వారిని డిశ్చార్జ్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు మరియు ప్రోత్సహించేందుకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య ఉచితంగా పెన్నులు అందించారు. సమయాన్ని వృథా చేయకుండా, ఏకాగ్రతతో చదివి, మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
NLG: పట్టణంలోని ప్రగతి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించే పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద BNS సెక్షన్ 163 (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా తిరగడం నిషేధమని హెచ్చరించారు.
E.G: అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ సూచించారు. బుధవారం రాజమండ్రి జీజీహెచ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా.? అని ప్రశ్నించారు. ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
KMR: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. మద్నూర్ కేంద్రానికి అశ్విని అనే విద్యార్థిని నిర్ణీత సమయం కంటే కొంత ఆలస్యంగా చేరుకుంది. అధికారులు నిబంధనల మేరకు ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో పరీక్ష రాయలేకపోయింది.విద్యార్థిని కన్నీటి పర్యంతమవుతూ అక్కడి నుంచి వెనుదిరిగింది.
దేవరకొండ: పట్టణంలోని 3వ వార్డు కౌన్సిలర్ అంకురి సుమలత వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వార్డులో పేరుకుపోయిన మురికి కాలువలను స్వయంగా పర్యవేక్షించి పూడిక తీయించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తి చెందకుండా మురుగు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఇన్‌ఛార్జి DMHO డా.రవీందర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే సాధారణ కాన్పులే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. చిన్నపిల్లలకు టీకాల వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు.
TG: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్య చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. ఇక్కడ IVF కేంద్రం ప్రారంభమైన తర్వాత, తొలిసారిగా ఆ చికిత్స ద్వారా ఓ మహిళ విజయవంతంగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. నిరుపేదలకు ఖరీదైన సంతాన సాఫల్య చికిత్సను ఉచితంగా అందిస్తూ గాంధీ వైద్యులు అరుదైన విజయాన్ని అందుకున్నారు.
BDK: మణుగూరు కట్టు మల్లారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పోడు భూమి సమస్యపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫారెస్ట్ అధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి సమస్యను సమగ్రంగా చర్చించారు. గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
CTR: పుంగనూరు పురపాలక కార్యాలయంలో రేపు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్టు, బస్టాండులోనికి వచ్చు ప్రవేటు వాహన దారుల నుంచి ఫీజు వసూలు, PMC బస్టాండ్, పబ్లిక్ యూరినల్స్ మొదలగు వాటికీ వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్వాతంత్య్రం తర్వాత భారత్‌లోపలు రాష్ట్రాల పేర్లు మారాయి. యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్‌గా, మద్రాస్ తమిళనాడుగా, మైసూర్ కర్ణాటకగా రూపాంతరం చెందాయి. ఉత్తరాంచల్.. ఉత్తరాఖండ్‌గా, ఒరిస్సా ఒడిశాగా మారగా, లక్కడివ్ దీవులు లక్షద్వీప్‌గా పిలవబడుతున్నాయి. తాజాగా కేరళ పేరును కూడా ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అన్నమయ్య: మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మరణించింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద విడుదలైన నిధులతో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. టీడీపీ నాయకుడు బీపీ ఈరన్న కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
పట్టణాల్లో ఉన్న పేదలకు ‘పీఎం ఆవాస్ యోజన 2.0’ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా కొత్తగా 2,87,618 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో PMAY-U 2.0 పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మంజూరైన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరింది. తాజా విడతలో ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లబ్ధి చేకూరనుంది.