• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వనపర్తి అత్యాచార కేసులో శిక్ష ప్రకటింపు

వనపర్తి: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పక్కా సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. బాధితురాలికి న్యాయం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు సంఘంలో మంచి సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు.

February 25, 2026 / 12:27 PM IST

విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

AP: విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చంది. కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. కోర్టు ఆవరణలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల విజయవాడ, అనంతపురం జిల్లా కోర్టులకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.

February 25, 2026 / 12:25 PM IST

ముస్తాబైన ప్రీ-ప్రైమరీ గదులు..!

SRPT: నడిగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ నిధులతో ప్రీ-ప్రైమరీ విభాగం సరికొత్తగా ముస్తాబవుతోంది. చిన్నారులను ఆకట్టుకునేలా తరగతి గది గోడలపై అక్షరాలు, అంకెలు, పక్షులు, జంతువుల చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరిస్తున్నారు. ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

February 25, 2026 / 12:25 PM IST

జాబ్ మేళాలతో లక్ష మందికి ఉద్యోగాలు

GNTR: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేశ్ శాసనసభలో బుధవారం తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేపడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

February 25, 2026 / 12:24 PM IST

మరో కేంద్రానికి.. అయినా సమయానికి!

VKB: ఇంటర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తొలిరోజు తడబాటుకు గురయ్యారు. తాండూరు పట్టణంలో ముగ్గురు విద్యార్థులు హడావుడిలో పొరపాటున వేరే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ బలరాం, మరో వ్యక్తి వారిని తమ బైకుపై ఎక్కించుకుని వారి పరీక్షా కేంద్రానికి సమయానికి చేర్చారు.

February 25, 2026 / 12:24 PM IST

‘హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి’

MHBD: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎస్సై గిరిధర్ రెడ్డి సూచించారు. బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా గూడూరు మండలంలో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ ఉండాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

February 25, 2026 / 12:23 PM IST

CID నోటీసులపై స్పందించిన ఆళ్ల

AP: CID నోటీసులపై మాజీ MLA ఆళ్ల రామకృష్ఱారెడ్డి స్పందించారు. ‘ఈ నెల 23 ACB కోర్టు నుంచి నాకు నోటీసులు అందాయి. భూముల విలువ పెంచుకోవడానికి IAS శ్రీకాంత్‌ను తప్పించి శ్రీధర్‌ను నియమించారు. RK హౌసింగ్ బినామి పేరుతో మంత్రి నారాయణ భూములు కొన్నారు. కంతేరు సమీపంలో హెరిటేజ్ భూములు కొన్నారు. కోట్ల విలువైన భూములను హెరిటేజ్‌కు రూ.8 లక్షలకే ఎలా అమ్మారు’ అని ప్రశ్నించారు.

February 25, 2026 / 12:21 PM IST

రేపు డయల్ యువర్ డిపో మేనేజర్

SRD:  ఖేడ్ నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యాలు, అభిప్రాయాలు సూచనలు తెలుసుకునేందుకుగాను రేపు డయల్ యువర్ DM నిర్వహిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 గురువారం ఉదయం 11:00 నుంచి 12:00 వరకు డయల్ యువర్ DM కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు బస్సు సమస్యల సూచనలు ఇచ్చేందుకు DM నెంబర్ 9959223170కు కాల్ చేయాలని కోరారు.

February 25, 2026 / 12:21 PM IST

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేష్

AP: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే నినాదమన్నారు. ప్రతి జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. MOUలు కుదిరిన 77 ప్రాజెక్టులు GOM ట్రాక్ చేస్తోందన్నారు. 20 నెలల్లో 1,587 జాబ్ ఫెయిర్‌లు నిర్వహించామని, 11,373 కంపెనీలు ఫెయిర్‌లో పాల్గొన్నట్లు చెప్పారు.

February 25, 2026 / 12:21 PM IST

అమర సైనికుడి కుటుంబానికి పరామర్శ

ATP: గార్లదిన్నె మండలంలో మరణించిన భారత సైనికుడు సాకే నరేష్ భౌతికకాయానికి ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మొంటిమడుగు కేశవరెడ్డి సతీమణి విజేత నివాళులర్పించారు. గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని నరేష్ కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

February 25, 2026 / 12:20 PM IST

‘చెరువులకు నీరు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’

CTR: చెరువులకు గ్రావిటీ ద్వారా నీరు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అసెంబ్లీలో బుధవారం కోరారు. పశ్చిమ ప్రాంతాలలో కరువును తీర్చేందుకు హంద్రీనీవా జలాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కుప్పానికి వెళ్తున్న నీరు పలమనేరు నియోజకవర్గంలోని పలు చెరువులకు చేరుతున్నట్టు ఆయన చెప్పారు.

February 25, 2026 / 12:19 PM IST

గవర్నర్‌‌కి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

గుంటూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఘన స్వాగతం పలికారు. చినకొండ్రుపాడులో నిర్వహించిన ప్రైవేట్ వైద్య కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ని కలెక్టర్ పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 25, 2026 / 12:18 PM IST

‘రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి’

VZM: తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబినాయన కోరారు. వైసీపీ హయాంలో PR రోడ్లను R&Bలో విలీనం చేసినా నిధులకు ప్రతిపాదనలు చేయలేదన్నారు. పణుకువలస జంక్షన్ నుంచి వంతరాం రోడ్డుకు రూ.3కోట్లతో ప్రతిపాదనలు చేశామని నిధులు మంజూరు చేయాలన్నారు.

February 25, 2026 / 12:18 PM IST

BREAKING: ఫలితాలు విడుదల

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితా విడుదలైంది. ఈ మేరకు యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో జాబితాను ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో జాబితాను చూసుకోవాలని తెలిపింది.

February 25, 2026 / 12:18 PM IST

‘దేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి’

TG: కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా కొందరు మావోయిస్టులు లొంగిపోతే ‘ఆపరేషన్ కగార్’ పూర్తవుతుందని పేర్కొన్నారు. అంతమైన కమ్యూనిజాన్ని రేవంత్, KCR బతికించాలని చూస్తున్నారని, అర్బన్ నక్సలైట్లను కూడా అంతం చేస్తామని హెచ్చరించారు.

February 25, 2026 / 12:15 PM IST