AP: విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చంది. కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. కోర్టు ఆవరణలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల విజయవాడ, అనంతపురం జిల్లా కోర్టులకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.