KNR: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తెలిపారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 27న హకీంపేటలో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SDPT: చదువుతో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహ నిర్మాణానికి బుధవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం నిర్మాణానికి రూ. 20 వేలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కోనసీమ: అమలాపురం పట్టణ మున్సిపాలిటీ మంచినీటి కుళాయి సమస్యపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌కి 19, 20 వార్డుల ప్రజలు బుధవారం వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం పట్టణంలో మంచినీటి సమస్య కొరత ఉన్నదని, ట్యాంకుల ద్వారా అన్ని వార్డులకు సప్లై చేయాలని, వేసవికాలం సందర్భంగా వార్డుల పరిధిలో మంచినీటి సమస్య లేకుండా తీర్చాలని వారు కోరారు.
NLR: సీతారామపురం మండలం బసినేనిపల్లి వద్ద హైవే పక్కన కరెంట్ స్తంభాలు నిల్వ చేశారు. గత నెలలో ఈ ప్రాంతంలోనే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఇలా రోడ్డు మార్జిన్‌లో ఎలా పడితే అలా స్తంభాలు నిల్వ చేయడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైవే నిర్వాహకులు చెప్పినా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించట్లేదని మండిపడుతున్నారు.
GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధి రాఘవేంద్ర కాలనీలో రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 9వ వార్డు కౌన్సిలర్ శ్రీరామలింగేశ్వర కాంళ్లే సొంత ఖర్చుతో కొత్త వీధిలైట్లు కొనుగోలు చేసి మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో అమర్చారు. కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.
ASF: ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామంలో బుధవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. భూ సర్వే ద్వారా ప్రతి ఎకరాకు స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతులు తమ భూములను చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో భూ తగాదాలు రావని, ఆస్తి హక్కులు భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో బుధవారం ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో బుధవారం ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఫోటో వేసి ఎంపీడీకే అరుణ ఫోటో వేయకపోవడంతో భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 21వ వార్డులో చేస్తున్న డ్రైనేజీ కాలువ పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి బుధవారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. వార్డుల్లో పారిశుద్ధ పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా సమస్యలపై వెంటనే స్పందించాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్యం ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులదే కీలకపాత్ర అన్నారు.
MDK: పార్టీలకు అతీతంగా రామాయంపేట అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య సూచించారు. బుధవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు.
AP: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్(28) అనే వ్యక్తి లండన్‌లో మృతి చెందాడు. లండన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ తల్లి తన కుమార్తెను హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆశాలత భర్తతో విడాకులు తీసుకుని భరణం కింద రూ.4 లక్షలు పొందింది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెడ్డి కుమార్‌తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తోంది. వారి పెళ్లికి కుమార్తె అడ్డుగా ఉందని భావించి ఆమెను హత్య చేసి పూడ్చి పెట్టినట్లు సమాచారం.
MDK: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. బుధవారం చేగుంట మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఏపీ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో రజకులకు ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రయోజన పథకం కింద దాదాపు 50 వాషింగ్ మిషన్లు బుధవారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రజకుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని నాయకులు తెలిపారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
RR: నందిగామ మండల కేంద్రానికి చెందిన నర్సమ్మ అనే మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పత్రాన్ని వార్డు సభ్యులు ప్రవీణ్, గ్రామ యువకులు, అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతుందని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.
బాపట్ల: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరీక్షలు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.