MDK: టేక్మాల్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆర్డీవో రమాదేవి మండల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలోని వసతులను కళాశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని వారికి సూచించారు. వీరిలో తహశీల్దార్ తులసిరామ్, కళాశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
అన్నమయ్య: రాయచోటికి చెందిన గాజుల హజీ బాషను వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హజీ బాష మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
MBNR: మద్యం సేవించి వాహనాలు నడిపితే జీవితాలు రోడ్డుపాలవుతాయని మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సీఐ బుధవారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ నిర్ణయ సామర్థ్యం తగ్గి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.
TPT: గూడూరు మండల పరిధిలోని కొండ గుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అయ్యవారి పాలెం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా పయనం సాగించాలన్నారు.
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’. నేరుగా ఈ సినిమా OTTలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ ఇంగ్లీష్, తెలుగుతో సహా 19 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ తెరకెక్కించిన ఈ మూవీలో కార్ల్ అర్బన్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ప్రియాంక ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉంది.
SKLM: డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జెమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన సందర్శించారు. అన్ని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న వారిలో బుధవారం 13 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
MDK: కౌడిపల్లి నుంచి మెదక్ వెళ్తున్న ద్విచక్ర వాహనానికి లోతు వాగు వద్ద కుక్క అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో దేవులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు.
TG: బాసర విద్యార్థిని వసంత ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు గణేష్ ఆత్మహత్య చేసుకోవడంతోనే వసంత హాస్టల్‌లో ఉరేసుకుందని పోలీసులు చెబుతున్నారు. గణేష్ తన ఫోన్, వాట్సాప్ బ్లాక్ చేశాడని మనోవేదన చెందిన వసంత.. బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు కారణాలపై స్పష్టత ఇవ్వాలంటూ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు.
KRNL: విజయవాడలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును జిల్లా TDP అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత బలోపేతం, స్థానిక సమస్యలు, రాబోయే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. గ్రామ స్థాయి కమిటీలను చురుకుగా మార్చడం, నాయకులు–కార్యకర్తల సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు.
NLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఇవాళ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సందర్శించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలను భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. కాపీ కి అవకాశం లేకుండా చూడాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని సౌల్ల తండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా సోమ్లాకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ఆదేశాల మేరకు ఇవాళ సర్పంచ్ గుగులోత్ సుజాత వాసు చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం ప్రతి పేద వారికి ఒక వరం అని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BHPL: కాటారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతాపగిరి పాఠశాలలో బాలుర మరుగుదొడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా అధికారుల స్పందించాలన్నారు.
TG: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమవ్వడంతో కాసేపట్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
NDL: భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు తెచ్చింది TDPనే అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయంపై మండలిలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం చెప్పారు. విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందని YCP ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని TDP ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీ హైజాక్ చేసిందన్నారు.
SRD: కంగ్టి మండల అభివృద్ధి అధికారి సత్తయ్యకు పదోన్నతి లభించింది. గత రెండేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఈయనకు డిప్యూటీ సీఈఓగా ప్రమోషన్ కల్పిస్తూ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ సంగారెడ్డిలో సీఈవో జానకి రెడ్డితో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనకు పదోన్నతికి CEO అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు.