• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టీడీపీ అంటేనే ఒక సమిష్టి కుటుంబం: ఎమ్మెల్యే

కోనసీమ: టీడీపీ అంటే ఒక పార్టీ మాత్రమే కాదని, ఇదొక సమిష్టి కుటుంబమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం మానవవనరుల శాఖామంత్రి, యువ నాయకులు నారా లోకేష్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన డిన్నర్ ఆత్మీయ సమావేశం ఈ అంశాన్ని మరోసారి రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు.

February 25, 2026 / 05:36 AM IST

మంగళగిరిలో వైభవంగా హనుమంత వాహన సేవ

GNTR: మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సుందరంగా అలంకరించిన ఉత్సవ మూర్తులతో మాడవీధుల నుంచి మిద్దె సెంటర్ వరకు గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ వాహన సేవను దర్శించుకుంటే భక్తులకు సద్బుద్ధి, అభయం కలుగుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

February 25, 2026 / 05:35 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

CTR: పలమనేరు పెద్ద చెరువు కట్టపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైకులు ఢీ కొట్టిన ఘటనలో మండిపేట కోటూరుకు చెందిన లక్ష్మీ పతి, మాదిగ బండకు చెందిన హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

February 25, 2026 / 05:34 AM IST

వరంగల్ సూపర్ స్పెషాలిటీపై హరీశ్‌రావుకు మంత్రి కౌంటర్..!

MDK: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్‌ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు.

February 25, 2026 / 05:34 AM IST

నల్లమాడలో జూదరుల అరెస్ట్

సత్యసాయి: నల్లమాడ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 05:30 AM IST

జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం

ATP: జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రులు ఆదేశించారు.

February 25, 2026 / 05:30 AM IST

వైసీపీ నాయకులపై దాడి చేయడం సరికాదు: కాకాణి

నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వెంకటాచలం పంచాయతీ వడ్డె పాలెం వైసీపీ నేత ఉప్పు రాఘవేంద్రను నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాఘవేంద్రపై దాడి హేయమన్నారు. వెంకటాచలం పంచాయతీలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు.

February 25, 2026 / 05:30 AM IST

అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేసిన సీఐ

KKD: గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పిఠాపురం సీఐ శ్రీనివాస్ వాహనాలను అర్ధరాత్రి తనిఖీ చేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేపట్టారు. అలాగే “వాష్ & గో” కార్యక్రమం ద్వారా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్‌సీ, పీయూసీ తదితర పత్రాలను సమగ్రంగా పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచనలు ఇచ్చారు.

February 25, 2026 / 05:30 AM IST

‘రాజీ పడదాం.. హాయిగా ఉందాం’

E.G: లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులను రాజీ చేసుకోవాలని తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ సూచించారు. మంగళవారం కొవ్వూరు కోర్ట్ హాల్ నుంచి పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, దీనివల్ల సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు జివిఎల్ సరస్వతి, జి. సాయికృష్ణ, CIలు, SIలు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:26 AM IST

‘నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి’

ADB: వేసవికాలంలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. నిన్న రూరల్ మండలం లండసాంగి గ్రామ సమీపంలోని పంప్ హౌస్ ను మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ EE గంగాధర్, DE అరుణ్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులు, AE, స్థానికులు, తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 05:23 AM IST

స్కూలు వాహనాలపై రవాణాశాఖ నిఘా

SRCL: జిల్లా వ్యాప్తంగా పాఠశాల బస్సులు, ఆటోలపై రవాణాశాఖ అధికారులు మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీటీవో లక్ష్మణ్ ఆదేశాల మేరకు వేములవాడ,ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట,చందుర్తి, రుద్రంగి, తంగళ్లపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని 15 వాహనాలను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్‌నెస్ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 25, 2026 / 05:21 AM IST

రోడ్డు భద్రతే లక్ష్యంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం

PDPL: రోడ్డు భద్రతే లక్ష్యంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేని వారికి చలాన్లకు బదులు హెల్మెట్లు పంపిణీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీలు రమేష్, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, సీఐలు రమేష్, హరిశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:56 AM IST

పొడపాడులో ప్రజా సమస్యలు తెలుసుకున్న MLA

PLD: పెదకూరపాడు మండలం పొడపాడులో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. ‘100 రోజులు – 100 గ్రామాలు’ లక్ష్యంతో ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రామంలోనే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

February 25, 2026 / 04:48 AM IST

రైతులకు గమనిక..ఈ-క్రాప్ నమోదుకు నేడే చివరి తేదీ

BPT: అద్దంకి మండలంలో పంటలు సాగు చేసిన రైతులు బుధవారం సాయంత్రం లోగా ఖచ్చితంగా ‘ఈ-క్రాప్’ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (AO) వెంకటకృష్ణ సూచించారు. ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ పొందాలంటే ఈ నమోదు తప్పనిసరి. ఇంకా నమోదు చేసుకోని వారు వెంటనే తమ గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.

February 25, 2026 / 04:44 AM IST

ప్రమాదాల నివారణపై ‘అరైవ్-అలైవ్’ అవగాహన

SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో మంగళవారం ఎస్సై వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.

February 25, 2026 / 04:38 AM IST