• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపటి నుంచి రెవెన్యూ క్లినిక్

PPM: జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి గ్రామస్థాయిలో ‘రెవెన్యూ క్లినిక్స్’ ప్రారంభం కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయములో రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతి గురువారం వీఆర్వోలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లినిక్లు నిర్వహించాలన్నారు.

February 25, 2026 / 04:19 PM IST

వామపక్షల రౌండ్ టేబుల్ సమావేశం

VSP: ఆంధ్రా యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మత వైషమ్యాలకు దారితీస్తున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం విశాఖలో పలు ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలను మత రాజకీయాలకు వేదికగా మార్చొద్దని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

February 25, 2026 / 04:19 PM IST

గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి

MHBD: గురుకులాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మికి DSFI నేతలు వినతిపత్రం అందజేశారు. DSFI రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్‌లు మాట్లాడుతూ.. గురుకులాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు.

February 25, 2026 / 04:19 PM IST

ఏఐ టెక్నాలజీ క్లినిక్‌ను ప్రారంభించిన సినీనటి

విజయనగరంలో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద బుధవారం మొట్ట మొదటి ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఓ క్లినిక్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీనటి కామ్నా జెట్మిలాని, డీఎస్పీ గోవిందరావు విచ్చేశారు. ఈ సందర్భంగా MAC చైర్ పర్సన్ అండ్ ఫౌండర్ డా. శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ.. అందరికీ అందుబాటు ధరల్లోనే మా సర్వీసులు ఉంటాయన్నారు.

February 25, 2026 / 04:18 PM IST

కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు

ELR: సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజు కొనసాగాయి. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు దీక్ష చేశారు. సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కారం. దారయ్య అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 04:18 PM IST

585 మంది‌ విద్యార్థులు ‌గైర్హజరు

AKP: జిల్లాలో 34 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 585 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 13,939 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,354 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఎం వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 04:18 PM IST

పెదవలసలో ఆధార్ కేంద్రం ప్రారంభం

ASR: జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ వద్ద రైతు సేవ కేంద్రంలో బుధవారం ఆధార్ సేవలు ప్రారంభం అయ్యాయని సచివాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని పేరు మార్పులు, చేర్పులు, కొత్తగా ఆధార్ నమోదు సేవలు అందుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది తెలిపారు.

February 25, 2026 / 04:16 PM IST

‘ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయండి’

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు, వంశధార మహేంద్ర తనయ నదుల పై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వలసలు వెళ్లకుండా సాగునీరు అందించాలన్నారు. పాత ప్రాజెక్టులకు మరమ్మతుల నిధులు కేటాయించాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

February 25, 2026 / 04:16 PM IST

‘మట్టి పోసి ఈ రోడ్డు సమతుల్యం చేయండి’

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, అయ్యప్ప కాలనీ పార్క్, ఆనంద్ కాలనీ సమీపంలో ఇటీవల వేసిన రోడ్ల పనులు పూర్తిగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరుపక్కల మట్టి పోయకపోవడంతో వాహనాలు జారిపడి గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పక్కన మట్టి పోసి సమతుల్యం చేయాలన్నారు.

February 25, 2026 / 04:16 PM IST

సాయి బాబా నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

TPT: తిప్పవరప్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శిరిడి సాయిబాబా మందిరం బాబావారి నూతన విగ్రహ ప్రతిష్టా మహాకుంభాభిషేకం కార్యక్రమంను బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ & గూడూరు నియోజకవర్గ ఇంఛార్జి మెరిగ మురళీధర్ పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాధాలు స్వీకరించారు.

February 25, 2026 / 04:14 PM IST

కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే 

TG: సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. MGNREGS కింద రోడ్డు నిర్మాణంపై స్టే ఇచ్చింది. మార్చి 25 వరకు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. మార్చి 25లోగా కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు సూచించింది.

February 25, 2026 / 04:13 PM IST

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

MLG: ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి నేడు మంత్రి సీతక్క పరిశీలించారు. ములుగు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేలా భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

February 25, 2026 / 04:11 PM IST

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తాం’

JGL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మెట్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపురి లింబాద్రి అన్నారు. మెట్పల్లిలోని ఏడో వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యమన్నారు.

February 25, 2026 / 04:10 PM IST

రెవెన్యూశాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష

TG: రెవెన్యూశాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలో తహశీల్దార్, RDO ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. తొలిదశలో 60 తహశీల్దార్, 5 ఆర్డీవో ఆఫీసులకు కొత్త భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముగింపు పలుకుతామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు.

February 25, 2026 / 04:10 PM IST

CITU అంగన్వాడీ సమస్యలపై వినతిపత్రం

KRNL: పత్తికొండలో CITU అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షల క్రమంలో ఇవాళ పీడీ వద్ద ఐసీడీఎస్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు ఉద్యోగుల అవగాహన, సమస్యలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు త్వరిత పరిష్కారం చేపట్టాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగి ప్రతినిధులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:10 PM IST