• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది

E.G: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు చూస్తుందని నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు బద్రం దొర విమర్శించారు. బుధవారం నిడదవోలు మండలం కలవచర్లలో ఉపాధి హామీ కూలీలకు పథకం గురించి వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:29 PM IST

నాలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు!

రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.9,072 కోట్లతో మూడు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, MP, బీహార్, జార్ఖండ్‌లలో 307 కి.మీ. మేర కొత్త ట్రాకులు నిర్మించనున్నారు. 2030-31 నాటికి వీటిని పూర్తి చేయాలనేది లక్ష్యం. దీనివల్ల కీలక మార్గాల్లో రైళ్ల రద్దీ తగ్గి, సరుకు రవాణా మరింత వేగంగా, సులభంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

February 25, 2026 / 04:28 PM IST

ఇప్పటి వరకు రూ.8.30 కోట్లతో అభివృద్ధి: కోటంరెడ్డి

నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో 247 పనులు ప్రారంభించామని, వాటిలో ఇప్పటికే 187 పనులు పూర్తి చేశామని టీడీపీ నేత గిరిధర్ రెడ్డి బుధవారం వెల్లడించారు. 23వ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8.30 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానికులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

February 25, 2026 / 04:26 PM IST

కలెక్టరేట్ ముందు తెలంగాణ జాగృతి ధర్నా

KNR: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TG జాగృతి ఆధ్వర్యంలో KNR కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నెలకు రూ.2500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ ఏమైందని నేతలు ప్రశ్నించారు. 26 నెలలు గడిచినా బడ్జెట్ సాకులు చెప్పడం సరికాదని, హామీలు నెరవేర్చకుంటే CM నివాసాన్ని ముట్టడిస్తామన్నారు.

February 25, 2026 / 04:26 PM IST

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: గెల్లు శ్రీనివాస్

ADB: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల పక్షాన ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు పెడతారా అని తెలంగాణ BRSV రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధవారం పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS నాయకులపై ఎన్ని కేసులు పెట్టిన వెనుకడుగు వేసేది లేదని హెచ్చరించారు.

February 25, 2026 / 04:25 PM IST

జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా: CM

AP: మార్కాపురం జిల్లా దోర్నాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ దగ్గర.. రూ.456 కోట్లతో ఆధునీకరించిన ఫీడర్ కెనాల్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ రైతులతో మాట్లాడారు. ‘మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు చేశాను’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 04:24 PM IST

దుప్పిని ఖననం చేసిన ఫారెస్టు అధికారులు

కడప-కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నముక్కపల్లె వద్ద కారు ఢీకొని మృతి చెందిన దుప్పిని డీఎఫ్‌వో ఆదేశాల మేరకు ఎల్బీవో శాంతి మంగళవారం ఖననం చేశారు. పశువైద్య అధికారి ఎం.లక్షుమయ్య మరణించిన దుప్పికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఖననం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్వాచర్ నవీన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:23 PM IST

భక్తుల మనోభావాలను గౌరవిస్తాం: కేంద్ర మంత్రి

BDK: మణుగూరులోని చారిత్రాత్మక శ్రీ కాళీమాత ఆలయ తరలింపు మరియు పునఃప్రతిష్ఠా పనులపై కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి బుధవారం సానుకూలంగా స్పందించారు. BTPS రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా 55 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం తొలగింపుకు గురవుతున్న నేపథ్యంలో, ఆలయ కమిటీ విన్నపాన్ని పరిశీలించి ఆలయ తరలింపుకు అయ్యే ఖర్చులు నిబంధనల ప్రకారం అందిస్తామని సూచించారు.

February 25, 2026 / 04:22 PM IST

తిరుమల శ్రీవారి వస్త్రాలు ఈ-వేలం

TPT: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ మార్చి 02 నుంచి ఆన్‌లైన్‌లో ఈ-వేలం వేయనుంది. ఈ వేలం మార్చి 09 వరకు కొనసాగుతుంది. వివిధ రకాల వస్త్రాల 287 లాట్లను కొనుగోలు చేయడానికి భక్తులు https://konugolu .ap.gov.in వెబ్సైట్ ద్వారా పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు టీటీడీ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

February 25, 2026 / 04:22 PM IST

ఉచిత మెగా వైద్య శిబిరం

SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని సర్పంచ్ బోయిని సంపత్ తెలిపారు. 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి దాదాపు రూ.20 వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డా. జయంత్, డా. సాయి శ్రీ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. అనంతరం హాస్పిటల్ యాజమాన్యాన్ని సన్మానించారు.

February 25, 2026 / 04:21 PM IST

ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కొత్వాల దంపతులు

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 9వ డివిజన్ గుడిపాడు లో నూతనంగా పునర్నిర్మాణం జరిగిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ 5వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.

February 25, 2026 / 04:21 PM IST

విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్

నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యా ప్రామాణికతలు పాటించినందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను అధికారులు బుధవారం అందజేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ సర్టిఫికెట్‌ను అందించారు. దీంతో కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

February 25, 2026 / 04:21 PM IST

ఎమ్మెల్సీ దృష్టికి గ్రామ సమస్యలు

MDK: చేగుంట మండలం పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను బుధవారం కలిశారు. పోలంపల్లి గ్రామ సమస్యలను ఎమ్మెల్సీ కోదండరాం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామ సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాం సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి నిధులు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వార్డు సభ్యులు చింతకాయల ప్రవీణ్ పాల్గొన్నారు.

February 25, 2026 / 04:20 PM IST

జగన్ నిర్వాసితులకు రూపాయి కూడా ఇవ్వలేదు: నిమ్మల

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం, దగా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆనాడు 2019 ముందు చంద్రబాబు నిర్మాణాలు చేసినవి తప్ప జగన్ ఎలాంటి చేయలేదని, భవిష్యత్తులో ఎవరు మంచి చేస్తారో వారినే ఆదరించాలని పిలుపునిచ్చారు.

February 25, 2026 / 04:20 PM IST

‘జాంబీరెడ్డి 2’పై క్రేజీ న్యూస్..!

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబీరెడ్డి’ మూవీకి సీక్వెల్‌గా ‘జాంబీరెడ్డి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించాడట. ఫస్ట్ పార్ట్ కంటే ఈ మూవీ అంతకుమించి వైల్డ్‌గా ఉంటుందట. VFX విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జాంబీలతో పోరాడే సన్నివేశాలు ఈసారి మరింత డెడ్లీగా ఉంటాయని టాక్.

February 25, 2026 / 04:20 PM IST