మానసిక ఒత్తిడి నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. నిరంతర ఆలోచనలు రక్తపోటును పెంచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా పుస్తకాలు చదవడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం మానేసి, ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకుంటే మనసు తేలికపడి ఆయుష్షు పెరుగుతుంది.
RR: నందిగామ మండలం తాళ్లగూడ గ్రామంలో హెచ్ఎండీఏ నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, సీసీ రోడ్డు, డ్రైనేజ్, రోడ్ల అభివృద్ధి ద్వారా గ్రామ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు.
BDK: మణుగూరు సింగరేణి ఏరియా పీవీ కాలనీలో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఇవాళ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతం కావాలని కమిటీ సభ్యులు తెలిపారు.
KMR: కామారెడ్డిలో రాజకీయ వేడి రాజుకుంది. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. కళాశాల ఆస్తుల వ్యవహారంపై నిజానిజాల నిర్ధారణకు శనివారం స్థానిక శిశుమందిర్ పాఠశాల వద్దకు చర్చకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సంస్థల యాజమాన్యాలు కూడా పాల్గొంటాయని పేర్కొన్నారు.
పార్వతీపురం ఐటీడిఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొమరాడ మండలంలో ఉన్న పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.
VSP: పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో కోట నరవ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘ప్రామిస్ ఫర్ క్లీన్ వైజాగ్’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొని మాట్లాడుతూ.. తడి–పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.
బాబర్ పేరుతో మసీదులు, మతపరమైన కట్టడాల నిర్మాణం, నామకరణాన్ని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపం నిర్మిస్తామన్న టీఎంసీ MLA వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. అయితే, ధర్మాసనం విముఖత చూపడంతో పిటిషనర్లు తమ విన్నపాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ అంశంపై జోక్యానికి న్యాయస్థానం నిరాకరించడం గమనార్హం.
GNTR: పెదకాకాని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లోని లోపాలు, వేతన చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు, వేతనదారులకు అవగాహన కల్పించారు. ఎంపీపీ శిరీష, ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఏపీవో మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
VZM: మెంటాడ(మం) చింతలవలసకు చెందిన వైసీపీ నాయకులు, వైసీపీ ప్రచారవిభాగం సభ్యులు కనిమెరక త్రినాధరావును రాష్ట్ర YCP బూత్ కమిటీల జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు వైసీపీ అదిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై మాజీ DCM పీడిక రాజన్నదొర తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కనిమెరక త్రినాధరావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ASR: గృహ లబ్ధిదారులకు బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. బలియగూడ పీవీటీజీ గ్రామానికి చెందిన 9 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టినా బిల్లులు రాక పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశంపై పాడేరు ఐటీడీఏలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
SRCL: జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.
AP: కడప జిల్లా కమలాపురం పరిధిలో భారతి సిమెంట్ ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఇచ్చిన హామీలను భారతి సిమెంట్ యాజమాన్యం అమలు చేయలేదని.. పెద్ద ఎత్తున బాధితులు ధర్నా చేస్తున్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారంటూ ఆందోళన చేపట్టారు. శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. కొందరికే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.
KKD: పిఠాపురం ICDS సీడీపీవో దుర్గాదేవి ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల క్యాంపెయిన్ భాగంగా రాపర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత స్కూల్లో జరిగింది. చిన్న తనంలో బాల్యవివాహాల వలన శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందరని అనేక సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. అమ్మాయికి 18 అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అన్నారు.
NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకొని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీఓ కోటేష్, ట్రైనర్ యూసుఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్పిన్నర్లకు శివం దూబే సింహస్వప్నంగా మారాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బంతి ఎక్కడ పడినా, దానిని స్టాండ్స్‌లోకి పంపే సామర్థ్యం దూబేకు ఉందని కొనియాడాడు. దీనివల్ల అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియక బౌలర్లు తలపట్టుకుంటున్నారని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కంటే కూడా దూబే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని పేర్కొన్నాడు.