AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రధాని మోడీతో (modi) డిస్కష్ అయ్యే సమయం లేదు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను (amith shah) జగన్ కలిశారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాల గురించి జగన్ (Jagan) వివరించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ఓ ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను త్వరగా ఆమోదించేలా చూడాలని అమిత్ షాను (amith shah) జగన్ (jagan) కోరారట. అలాగే విభజన అంశాల గురించి కూడా మరోసారి ప్రస్తావించారట. వీలయినంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు తెలిసింది. ఏపీ భవన్ గురించి కూడా జగన్ వివరించారట. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజన అంశం కూడా చర్చకొచ్చిందని తెలిసింది. ఇది పూర్తిగా అధికార కార్యక్రమం కావడంతో ఈ అంశాలే డిస్కషన్ చేశారని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల్లో పొత్తుల గురించి జనసేన, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ కూడా తమతో కలిసి వస్తోందని పవన్ కల్యాణ్ (pawan kalyan) చెబుతున్నారు. దీంతో పొత్తులపై తేలడం లేదు. ఈ సమయంలోనే అమిత్ షాతో (amith shah) జగన్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని వైసీపీ చెబుతోంది. కానీ ఆ మూడు పార్టీలు కలిసి రావడంతో లోన కాస్త భయం ఉండి ఉంటుంది. గత ఎన్నికల్లో మాదిరిగా 150 సీట్లు రాకపోయినా.. కొన్ని తగ్గొచ్చనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.