Rain Effect: అహ్మదాబాద్‌లో ఆగని వాన.. ఈ రోజు మ్యాచ్ జరగకుంటే..?
అహ్మదాబాద్‌లో ఎడతెరపి లేకుండా వాన పడటంతో ఐపీఎల్ ఫైనల్ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా వరణుడు ఆటంకం కలిగిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.
Rain Effect: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో జోరు వాన (Rain) కురుస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడటంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. రాత్రి 9.30 గంటలకు తగ్గితే ఓవర్లను కుదించకుండా నిర్వహిస్తామని అనుకున్నారు. రాత్రి 11 గంటల వరకు వెయిట్ చేశారు. అయినప్పటికీ వర్షం (Rain) తగ్గుతూ.. భీకరంగా కురుస్తోంది. దీంతో స్టేడియంలో నిలిచిన నీరును క్లియర్ చేయాలంటే కూడా గంట సమయం పడుతుందని ఈ రోజుకు మ్యాచ్‌ను పోస్ట్ పోన్ చేశారు.
నిన్న అయితే టాస్ (TOSS) వేసే ఛాన్స్ కూడా లేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్యలో వర్షం (Rain) కొంత గ్యాప్ ఇవ్వడంతో.. స్టేడియంలో చెన్నై, గుజరాత్‌కు చెందిన ఆటగాళ్లు వచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. మళ్లీ వాన పడటంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ రోజు రిజర్వ్ డే (Reserve Day) ఉండటంతో కాస్త రిలాక్స్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య ఈ రోజు మ్యాచ్ నిర్వహిస్తారు.
ఒకవేళ ఈ రోజు కూడా వరణుడు అడ్డుపడితే 20 ఓవర్లను కాస్త 5 ఓవర్లకు తగ్గిస్తారు. అదీ కూడా వీలు కాకపోతే.. సూపర్ ఓవర్ తీసుకుంటారు. వర్షం వల్ల పిచ్ తడిసి.. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకుంటే మ్యాచ్ రద్దు చేస్తారు. లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్‌ను విజేతగా ప్రకటిస్తారు. గ్రూప్‌లో గుజరాత్ టైటాన్స్ టాపర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. వరణుడి (Rain) అడ్డుతగలకుంటే మ్యాచ్ జరుగుతుంది. మళ్లీ వాన పడితే మాత్రం గుజరాత్ విజేతగా నిలుస్తోంది. వరసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచినట్టు అవుతుంది.