SDPT: సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ‘ఉద్యాన ఉత్సవ్-2026’ సందర్శనకు బుధవారం జగదేవ్పూర్ మండలం నుంచి 20 మంది రైతులు తరలివెళ్లారు. మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ.. ఈనెల 11 వరకు జరిగే ఈ ప్రదర్శనలో పూల, ఉద్యాన పంటల ప్రదర్శనతో పాటు సాగులో వస్తున్న నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కలుగుతుందన్నారు.