NLG: వేములపల్లి మండలం మొల్కపట్నంకి చెందిన సోమన బోయిన మల్లయ్య (75) గుండెపోటుతో ఇవాళ ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న BRS రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ వారి నివాసానికి వెళ్లి మల్లయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. వారి వెంట మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.