NLG: గాలిపటాలు ఎగరవేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిట్యాల విద్యుత్ ఏఈ రవీందర్ రెడ్డి అన్నారు. పిల్లలు ఎగురవేసేటప్పుడు విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా వారితో ఉండాలని చెప్పారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గాలిపటాలు ఎగరవేయవద్దని, అనుకోకుండా విద్యుత్ తీగలకు గాలిపటాలు ఇరుక్కుంటే తొలగించే ప్రయత్నం చేయవద్దని సూచించారు.