TG: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ‘నోటా’ను అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలను కోరారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారు.