»Rains For Two Days In Many Districts Of Telangana
Rain: తెలంగాణలోని జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు
వాయుగుండం ఈశాన్య దిక్కుగా కదులుతూ మరింత బలపడుతుండడంతో ఈ రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain: వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వర్షం ఏ క్షణమైన పడేలా ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కూడా ఇదే విషయాన్ని దృవికరించింది. రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే శనివారం రాష్ట్రంలో కొన్ని జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. అలాగే కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షపాతం పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య వైపు కదులుతోంది. శుక్రవారం ఉదయానికి ఇది బలపడే అవకాశం ఉంది. అలాగే వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయుగుండం ఈశాన్య దిక్కులోనే కదులుతూ బలపడితే శనివారం ఉదయం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని పేర్కొంది. అలాగే ఉత్తర దిక్కులోనే కదులుతూ మరింత బలపడితే తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చిరించింది. అలాగే ఈ తుపాను ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకొనే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు అలాగే ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ఏరియాలో రెండు రోజులు విస్తారంగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు.