AP: కాకినాడ జిల్లాలోని తుని రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్ ఆర్చ్పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది సమాచారం అందించగానే.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడేలేదని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.