TG: ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు 30 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని రూ. 12 వేలు ఇచ్చారన్నారు. సీఎం రేవంత్‌కు నదీ జలాలపై అవగాహన లేదన్నారు. దేవాదుల.. గోదావరి బేసిన్లో అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అప్పులు చేసి సంక్షేమానికి పెట్టుబడి పెట్టారని.. కాంగ్రెస్ నేతల్లా దోచుకోలేదని మండిపడ్డారు.