తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో(Manifesto)ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
రాజమండ్రిలో మహానాడు(Mahanadu) బహిరంగ సభ వేడుకగా సాగింది. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఫేజ్1 ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)ని ఆవిష్కరించారు. మహిళలు, యువత, రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనునిత్యం కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని, వారిది ధన బలం అయితే టీడీపీది ప్రజాబలం అని అన్నారు.
తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో(Manifesto)ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. దసరా నాటికి పూర్తి మేనిఫెస్టోను తీసుకురానున్నట్లు చంద్రబాబు తెలిపారు.
టీడీపీ మేనిఫెస్టో(TDP Manifesto) వివరాలు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సౌకర్యం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ.3 వేలు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో జమ. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తింపు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500 అందజేత. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఖాతాల్లో జమ స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత. రైతులకు అన్నదాత కార్యక్రమం. రైతులకు ఏటా రూ.20 వేలు అందజేత ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ బీసీల కోసం ప్రత్యేక చట్టం.