»Massive Fire Erupts On Pawan Kalyans Hari Hara Veera Mallu Movie Sets In Hyderabad
Hari Hara Veera Mallu సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం.. తప్పించుకున్న పవన్ కల్యాణ్
కురిసిన వర్షానికి సెట్ కూలిపోయింది. దానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో చిత్ర బృందానికి ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. షూటింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిత్ర బృందం (Move Unit) భయాందోళనకు గురైంది. అయితే ఎవరికేం ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) నటిస్తోంది. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. ఏఎం రత్నం (AM Ratnam) సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ (Mega Surya Production) బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతం ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) అందిస్తున్నారు. కాగా, హైదరాబాద్ (Hyderabad) దుండిగల్ పరిధిలోని బౌరంపేట్ లో ఆదివారం అర్ధరాత్రి షూటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో ఒక్కసారిగా సెట్ లో మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
అయితే ఇటీవల కురిసిన వర్షానికి సెట్ (Set) కూలిపోయింది. దానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో చిత్ర బృందానికి ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. కాగా, ఈ సినిమాకు మాటలు సాయిమాధవ్ బుర్రా అందిస్తుండగా.. ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ, నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఓజీ, బ్రో సినిమాలు పవన్ చేస్తున్నాడు.