»Modi Government 9 Years Changes In Defence Sector In Modi Government
PM Modi:మోడీ తొమ్మిదేళ్ల పాలనలో రక్షణ రంగంలో వచ్చిన మార్పులివే
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించింది.
PM Modi:మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. మోడీ ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించి కూడా అలాంటి కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంది. దాని కారణంగా చాలా పెద్ద మార్పులే కనిపించాయి. గత 9 ఏళ్లలో రక్షణ రంగంలో వచ్చిన ఈ మార్పులను ఒకసారి పరిశీలిద్దాం-
రక్షణ బడ్జెట్: గత 9 సంవత్సరాలలో రక్షణ బడ్జెట్ స్థిరమైన పెరుగుదలను చూసింది. దీన్ని బట్టి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో అంచనా వేయవచ్చు. రక్షణ రంగంలో ఆధునీకరణ, స్వాధీనత, పరిశోధన, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారు.
రక్షణ సేకరణ: దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఆధునిక ఆయుధాలు, సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. ఇందుకోసం దేశీయ రక్షణ ఉత్పత్తికి కూడా పెద్దపీట వేస్తుంది. దీని ప్రకారమే రక్షణ కొనుగోళ్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి.. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఇందుకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ (DPP), మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత కల్పించారు.
రక్షణ తయారీ: దేశీయ రక్షణ తయారీని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా, వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా వంటి కార్యక్రమాలు ఉపయోగించబడుతున్నాయి. అంతే కాకుండా డిఫెన్స్ తయారీలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించడంతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రక్షణ ఆధునికీకరణ: గత 9 సంవత్సరాలలో !!అభివృద్ధి చెందుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ బలగాల ఆధునీకరణపై మోడీ ప్రభుత్వం కన్నేసింది. దీని కోసం ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు, ఫిరంగి వ్యవస్థలు, హెలికాప్టర్లు మరియు క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుతో సహా అనేక ప్రధాన రక్షణ ఒప్పందాలు, కొనుగోళ్లు ఖరారయ్యాయి.
రక్షణ దౌత్యం: గత 9 సంవత్సరాలలో, రక్షణ దౌత్యంపై దృష్టి సారించింది. దీని కింద ద్వైపాక్షిక, బహుపాక్షిక సైనిక విన్యాసాలు, సాంకేతికత బదిలీ కారణంగా భారతదేశం అనేక దేశాలతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంది.
సరిహద్దు మౌలిక సదుపాయాలు: భారతదేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. భారత్-చైనా, భారత్-పాకిస్థాన్ సరిహద్దు వంటి సున్నితమైన ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రోడ్లు, వంతెనలు, సొరంగాలు మరియు ముందస్తు నిఘా వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు.
రక్షణ సంస్కరణలు: రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను ప్రారంభించింది. దీని కింద, ఏకీకృత సైనిక కమాండ్‌ను ఏర్పాటు చేయడానికి, కొత్త రక్షణ సిద్ధాంతాల వైపు వెళ్లడానికి చర్యలు తీసుకోబడ్డాయి.
డిఫెన్స్ టెక్నాలజీ , ఇన్నోవేషన్: దేశాన్ని స్వావలంబనగా మార్చడంలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వం, దేశీయ రక్షణ సాంకేతికతను, రక్షణ రంగంలో కూడా ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ఉద్ఘాటించింది. దీని కింద, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంస్కరణ, ప్రైవేట్ రంగాల సహకారంపై దృష్టి సారించింది.