Adipurush: `ఆదిపురుష్` ఫస్ట్ రివ్యూ.. ప్రభాస్ కు సాలీడ్ హిట్ గ్యారెంటీ ?
ఆదిపురుష్ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. రోజురోజుకు ప్రేక్షకుల్లో(Audience) అంచనాలను పెంచుకుంటూ వస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే రామాయణం(Ramayan) ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల కోసం థియేటర్లలోకి రాబోతుంది.
Adipurush: ఆదిపురుష్ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. రోజురోజుకు ప్రేక్షకుల్లో(Audience) అంచనాలను పెంచుకుంటూ వస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే రామాయణం(Ramayan) ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల కోసం థియేటర్లలోకి రాబోతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(kriti sanon) సీతగా నటించారు. సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan), సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు సినిమాలో కీలక పాత్రలను పోషించారు. మొన్నటి వరకు ఆదిపురుష్ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. కానీ, చిత్రయూనిట్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
చిత్ర యూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషన్స్ తో మరింత హైప్ పెరిగింది. అయితే తాజాగా ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ(first review) బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ రెడీ అయింది. రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించారట. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆదిపురుష్ అనుకున్న దానికంటే అద్భుతంగా ఉందని, సినిమా ఒక విజువల్ వండర్ లా ఉందన్నారట. మొదట్లో వచ్చిన విమర్శలకు దీటైన జవాబులా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్నాయని.. సీతారాములిగా ప్రభాస్, కృతి సనన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారట. రామాయణం ని గ్రాండ్ స్కేల్ లో సరికొత్త టెక్నాలజీ తో చూపించారని.. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అన్నారట.