Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై (Chandrbabu Naidu) మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) నిప్పులు చెరిగారు. మేనిఫెస్టోపై చంద్రబాబుకు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఏం చేశారని అడిగారు. ఎన్టీఆర్ బీసీల వల్లే పార్టీని పెట్టి.. అధికారంలోకి తీసుకొచ్చారని కొడాలి నాని (Kodali Nani) వివరించారు. ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి.. పవన్ కల్యాణ్, రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడును వెనక వేసుకున్నారని ఆరోపించారు. వీరిలో బీసీలు ఎవరు ఉన్నారని సూటిగా అడిగారు.
వైఎస్ఆర్ ఆపన్నహస్తం
2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక మేలు జరిగింది. ఫీజు రీయింబర్స్ మెంట్, ఇళ్ల నిర్మాణం తదితర పథకాలు చేపట్టారని కొడాలి నాని (Kodali Nani) గుర్తుచేశారు. ఎస్సీల్లో 80 శాతం మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు నిర్మించిందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్, జగన్ కలిసి 79 లక్షల ఇళ్లు నిర్మించారని తెలిపారు. వీటిలో 45 లక్షల ఇళ్లు బీసీల కోసం జగన్ కట్టించారని గుర్తుచేశారు. ఇళ్లు లేని నిరుపేదల కోసం చంద్రబాబు ఏం చేశారని అడిగారు. బీసీ పిల్లల చదువుల కోసం ఏం చేశారు? వృత్తివిద్యా కోసం ఏం చేశారని నిలదీశారు.
చంద్రబాబు 420
చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఆనాడు ఎన్టీఆర్ అన్నారని కొడాలి నాని (Kodali Nani) అన్నారు. అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు తారక్ కోసం మరో ఎన్టీఆర్ను నాశనం చేసే పనిలో ఉన్నారు. ప్రొడ్యూసర్లను చంద్రబాబు బెదిరించారని ఆరోపించారు. సినిమాలు ఆడకుండా చేశారని మండిపడ్డారు. రామారావు, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని చులకన చేసి మాట్లాడటం సరికాదన్నారు. మహానాడులో తారక్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టలేదన్నారు. అక్కడికి రాలేదని అంటున్నారని.. మరీ వెనకాలే ఉన్న బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కూడా గెలవలేని లోకేశ్ ఫోటో కూడా పెట్టడం ఎందుకు పెట్టారని అడిగారు.
17 మంది ఓసీలే
చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనేక వాగ్ధానాలు చేస్తున్నారని కొడాలి నాని (Kodali Nani) అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను ఎన్నింటినీ నెరవేర్చాడని అడిగారు. మైనార్టీలకు శాఖ లేదు, ఎస్టీలకు శాఖలేదన్నారు. సీఎం జగన్ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు 17 మంది ఓసీలకు మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఒక్క బీసీని రాజ్యసభకు పంపించావా అని అడిగారు. యనమల రామకృష్ణుడుకే ఇస్తారని తెలిపారు. వర్ల రామయ్యకు ఊరించి, ఊసురుమనిపిస్తారని ఆరోపించారు. టీజీ వెంకటేష్, సుజనా చౌదరీకి అమ్ముకుంటారని ధ్వజమెత్తారు.