»No Chance For Those Who Lost The Last Election Even For The Leaders Sons Cm Kcr
CM KCR: గత ఎన్నికల్లో ఓడిన వారికి నో ఛాన్స్.. వారసులకు కూడా
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
No chance for those who lost the last election.. Even for the Leaders Sons: CM KCR
CM KCR: తెలంగాణ గట్టు మీద మరో 5, 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. విపక్షాల సంగతి ఏమో కానీ.. అధికార పార్టీ మాత్రం వ్యుహాంతో వెళుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇదీ వరసగా మూడో పర్యాయం ఎన్నిక కాగా.. కాస్త అసంతృప్తి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్ వచ్చినట్టు ఉంది. అందుకే సీఎం కేసీఆర్ (CM KCR) గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను క్లియర్ చేస్తున్నారు. వీఆర్ఏ (VRA), పంచాయతీ సెక్రటరీల (PS) రెగ్యులరైజేషన్ ఇందుకే అని పొలిటికల్ ఆనలిస్టులు అంటున్నారు.
15 మంది ఎమ్మెల్యేలు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ జనానికి దగ్గర కావాలని సీఎం కేసీఆర్ (CM KCR) సూచించారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలకు (MLA) స్పష్టంచేశారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకుంటే.. అంతే సంగతులు అని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఓ 15 చోట్ల ఎమ్మెల్యేలు (15 MLA) అందుబాటులో ఉండటం లేదట. విషయం తెలిసి కేసీఆర్ (KCR) సీరియస్ అయ్యారు. వ్యతిరేకత, గెలిచే పరిస్థితి లేని వారిని మార్చే అవకాశం ఉంది. గతంలో ఇలానే చేశారు. మోస్తరు మార్కులు రాని 15 మంది వరకు ఉన్నారట. ఉమ్మడి మెదక్ (MEDAK) జిల్లాలో ఒకరు.. ఉమ్మడి ఆదిలాబాద్ (ADILABAD), వరంగల్ (WARANGAL), కరీంనగర్ (KARIM NAGAR) జిల్లా నుంచి ఒక్కొక్కరినీ సీఎం కేసీఆర్ (KCR) పిలిచి మాట్లాడినట్టు తెలిసింది.
వారి వైపు కేసీఆర్ మొగ్గు
గత ఎన్నికల్లో ఇతర పార్టీ నుంచి గెలిచి.. బీఆర్ఎస్లో చేరి, బలంగా ఉన్న అభ్యర్థులపై సీఎం కేసీఆర్ (KCR) మొగ్గుచూపుతున్నారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలకు సర్దిచెబుతున్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు (JUPALLY KRISHNA RAO) ఓడిపోగా.. కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి (HARSHAVARDHAN REDDY) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టికెట్ కోసం వీరి మధ్య పోటీ రాగా.. నేతలు జూపల్లికి (JUPALLY) ఇవ్వాలని కోరినా.. కేసీఆర్ (KCR) నో అన్నారట. దీంతో జూపల్లి కృష్ణారావు ధిక్కార స్వరం వినిపించడంతో వేటు వేయక తప్పలేదు.
ముగ్గురిలో ఎవరికీ దక్కెనో
కొత్తగూడెంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (VANAMA VENKATESHWAR RAO) ఉండగా.. టికెట్ కోసం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ట్రై చేస్తున్నారు. జలగం వెంకట్రావు రంగంలోకి దిగుతారని అంటున్నారు. అభ్యర్థి విషయపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడినుంచి పోటీ చేయాలని మాజీమంత్రి పట్నం మహేంధర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మంత్రి పదవీ ఇచ్చామని.. అతని భార్యను రెండోసారి జెడ్పీ చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించారు. అతని తమ్ముడికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. ఇంక ఏం చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
వారసులకు నో
అలాగే వారసుల పోటీపై సీఎం కేసీఆర్ సానుకూలంగా లేరని తెలిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడిని రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్.. పోచారం పోటీ చేస్తారని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా కుమారుడి కోసం ప్రయత్నించగా.. కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొందరు కుమారులను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వారసులకు టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అందుకు కేసీఆర్ నిరాకరించారట. వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని.. ఏ చిన్న తప్పుకు అవకాశం ఇవ్వొద్దనే కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.