• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి’

NRML: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి సురేష్ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో ఏపీడీకి వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్ల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 12న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

December 10, 2024 / 05:18 PM IST

విజయవంతంగా ప్రజా విజయోత్సవాలుపూర్తి: సీఎస్

HYD: ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా గత 9రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో విజయవంతంగా నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

December 10, 2024 / 05:17 PM IST

సీఎం రేవంత్ ఉద్యమ ద్రోహి: ఎర్రబెల్లి

TG: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రవర్తన మారటం లేదని మండిపడ్డారు. నాడు సోనియా గాంధీని బలి దేవత అని నేడు సోనియా వేడుకలు చేయడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ సంస్క‌తి, సంప్రదాయాలను మార్చాలనుకోవటం మూర్ఖత్వమని ధ్వజమెత్తారు.

December 10, 2024 / 05:17 PM IST

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఘనపూర్ నాయకులు

WGL: బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావును నేడు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై రాజయ్య మాజీ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. పార్టీ పరిస్థితి మరింత మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

December 10, 2024 / 05:16 PM IST

ఊరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

KRNL: ఆదోని పట్టణం ప్రశాంత్ నగర్‌లో నివాసం ఉంటున్న గోపాల్ అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోపాల్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ అఘాయిత్యానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

December 10, 2024 / 05:16 PM IST

గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం: కన్నా

పల్నాడు: గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

December 10, 2024 / 05:16 PM IST

కత్తెర తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి

ప్రకాశం: పంగులూరు మండలంలోని రామకూరు నార్నవారిపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన రైతులతో కలిసి మొక్కజొన్న పంటను పరిశీలించి అక్కడ కత్తెర పురుగు తెగులు గమనించారు. ఈ సందర్భంగా ఆయన దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు వివరించారు.

December 10, 2024 / 05:15 PM IST

కబ్జాలపై హైడ్రా కమిషనర్‌‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

HYD: చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరబాద్‌లోని బుద్ధ భవన్‌లో రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

December 10, 2024 / 05:14 PM IST

నిషేధిత గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్

KMM: దమ్మపేట మండలం పార్కల గండి గ్రామంలో మంగళవారం నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ఓ ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మండలానికి చెందిన సాయి కృష్ణ, ఆనంద్, కిషోర్ అనే ముగ్గురు నిషేధిత గంజాయికి బానిసలుగా మారి డొంకరాయి అనే గ్రామం వెళ్లి అక్కడ గంజాయి కొనుక్కొని వచ్చి సేవిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

December 10, 2024 / 05:14 PM IST

‘విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి’

ADB: విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ యశోద అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని సరస్వతి నగర్‌లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా పోషకాల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్తహీనతపై అవగాహన, నివారణ చర్యల గురించి వివరించారు.

December 10, 2024 / 05:13 PM IST

సిరాజ్- హెడ్ పరిపక్వత ఉన్న ఆటగాళ్లు: రవిశాస్త్రి

అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్-ట్రావిస్ హెడ్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రత్యర్థులు మనపై ఎంత తీవ్రంగా స్పందిస్తే.. అదే స్థాయిలో సమాధానం చెప్పాలని అభిప్రాయపడ్డాడు. అలాగే, ఇప్పటికే సిరాజ్- హెడ్‌ల వివాదం చల్లారిందని తెలిపాడు. దూకుడుగా ఉండటం సీమర్ల లక్షణం.. సిరాజ్ అదే చేశాడని పేర్కొన్నాడు.

December 10, 2024 / 05:12 PM IST

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసిన ఎంపీ కావ్య

WGL: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర విమానాయాల శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని నేడు ఎంపీ కడియం కావ్య కలసి వినతి పత్రం సమర్పించారు. మామునూరులో ఏర్పాటు భూస్థల సేకరణ, విస్తరణ పనులపై చర్చించారు. విమాన రాకపోకలకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

December 10, 2024 / 05:12 PM IST

పంటలకు తెగులు ఆశించకుండా రైతులు జాగ్రత్త వహించాలి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం ముసునూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏడిఏ ఈవీ వెంకటరమణ పాల్గొని రైతులకు సూచనలు చేశారు. రైతులు సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని పేర్కొన్నారు. పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

December 10, 2024 / 05:10 PM IST

నిరసన దీక్షలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ASF: ఆసిఫాబాద్ జిల్లా విద్యా శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మళ్లీ సమ్మెబాట పట్టారు. ఎన్నికలకు ముందు సమ్మెలో పాల్గొన్న వీరికి అప్పటి పీసీసీ అధ్యక్షుడి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం బైఠాయించి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు.

December 10, 2024 / 05:10 PM IST

‘గురుకుల సంక్షేమ హాస్టల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి’

SRPT: సంక్షేమ హాస్టల్లో గురుకులాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోట చలంకు పి.డి.ఎస్.యూ – పివైఎల్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగిందని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి తెలియజేశారు.

December 10, 2024 / 05:09 PM IST