ATP: గుంతకల్లు మండలం నెలగొండ గ్రామంలో మంగళవారం తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేలకొండ గ్రామంలో హిందూ స్మశాన వాటికకు స్థలము కేటాయించాలని గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీపీ మాధవి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
HYD: రాష్ట్రంలో ఫీజు రియంబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వర్లపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎం.శివానంద్ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం జరిగిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు.
KNR: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ, కరీంనగర్ ఆర్ఎం బి. రాజు తెలిపారు. ఈనెల 31 వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సు సర్వీసుల్లో ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. కావున, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
HYD: తెలంగాణపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని థియేటర్లో పుష్ప 2 చూస్తూ ముద్దానప్ప అనే అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షో ముగిశాక కూడా అతను సీటులో అలానే కూర్చొని ఉండగా.. మిగతా ప్రేక్షకులకు అనుమానం వచ్చి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబీకులు.. ముద్దానప్ప తొక్కిసలాట వల్లే చనిపోయాడని ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున...
AP: మూడు రాజ్యసభ స్థానాలకు బీద మస్తాన్‌రావు, సానా సతీశ్, ఆర్. కృష్ణయ్య నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. బీసీలకు టీడీపీ ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆర్.కృష్ణయ్య జాతీయ బీసీ నాయకుడు.. ఆయనపై కామెంట్ చేసేవాళ్లకు బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ...
NZB: బాన్సువాడ దేశంలో అట్టర్ ప్లాప్ సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో నేడు తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ.. ఏడాది పాలనలో ప్రజలు సీఎంను అసహ్యించుకుంటున్నారన్నారు. బాన్సువాడ ప్రజలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను గెలిపించుకుంటే పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో కాంగ్రెస్‌లో చేర...
CTR: నిండ్ర మండలం కొత్త ఆరూరులో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.2.30 లక్షల వ్యయంతో నిర్మించిన నాగయ్యకు చెందిన పశువుల షెడ్‌ను ప్రారంభించారు. నెట్టేరి గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో పాల్గొన్నారు.
MDK: తెలంగాణ తల్లిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్(కాసాల) చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ తల్లికి రూపురేఖలను తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ తల్లిగా తీర్చిదిద్దడంపై మండిపడ్డారు. జై తెలంగాణ అని నినాదాలు చేశారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని అడవి పాలెం గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రమేష్ బాబు తహసీల్దార్ రవిబాబు, రెవిన్యూ శాఖ సిబ్బంది పాల్గొని రెవిన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అలాగే వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
డిజిటల్ యుగంతో కీడు కూడా పొంచి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. డీప్ ఫేక్, గోప్యతకు భంగం వంటి విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని ‘మానవ హక్కుల దినోత్సవం’ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్య...
BPT: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల ఆహార, శాస్త్ర సాంకేతిక కళాశాలలో మంగళవారం కళాశాల అసోసియేట్ డీన్ సర్దార్ బెగ్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మానవులకు భద్రత, స్వేచ్ఛ, గౌరవం కల్పించేవే మానవ హక్కులని అన్నారు.
VZM: అర్హులైన నిరుపేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని మంగళవారం నెల్లిమర్ల సచివాలయం-2 కార్యదర్శికి వినతి అందించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు మాట్లాడుతూ.. గత 30 ఏళ్ల నుండి ఒకే ఇంట్లో మూడేసి కుటుంబాలు కాపురం ఉంటున్నాయని చెప్పారు. కూలి పనులు చేసుకుంటూ చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు.
KDP: కడప నగర మేయర్ నీటి సమస్యల గురించి పట్టించుకోవడంలేదని టీడీపీ నాయకుడు జిలాన్ తెలిపారు. మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ.. కడప వైసీపీ కార్పొరేటర్లు త్రాగు నీటి గురించి అడిగితే సాగు నీటి లెక్కలు చెబుతూ.. సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. కడపలో నీటి సమస్యపై, కార్పొరేషన్ అవినీతిపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు.
NZB: స్థానిక సంస్థల ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీలోపు తెలియజేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అలాగే అదేరోజు MPDOలు పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అన్నారు.