VSP: రాబోయే ఏ ఎన్నికల్లోనైనా భీమిలిలో వైసీపీ ఘనవిజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర (సిరమ్మ) ధీమా వ్యక్తం చేశారు. అవనాంలో జరిగిన మండల స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ కమిటీలను వెంటనే పూర్తి చేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
JGL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ నరేశ్ కోరారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా ‘ఏఎన్సీ డే’ క్లినిక్ నిర్వహించి, వారికి రక్త పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు బలోపేతం చేయడం లక్ష్యంగా సభ్యత్వాన్ని 25 వేల సంఖ్యకు చేర్చాలని సూచించారు.
ASR: నేరాల నియంత్రణ, నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో మహిళా పోలీసుల పాత్ర ముఖ్యమైనదని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. సోమవారం అరకులోయలో అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల మహిళా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. మహిళా పోలీసులు గ్రామాలలో నాటు సారా, గంజాయి సాగు, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు.
ELR: బుట్టాయిగూడెం మండలం K.R.పురం ఐటీడీఏ వద్ద యువజన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ స్థలంలో నిర్మిస్తున్న వ్యాపార భవన నిర్మాణాలను ఆపివేయాలన్నారు. యధావిధిగా అదే స్థలంలో హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టాలని, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దని పిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన 2023 WC ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమిని భారత్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తాజాగా S-8లో సౌతాఫ్రికా చేతిలో కూడా ఇదే స్టేడియంలో భారత్ చిత్తుగా ఓడింది. ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగబోతోంది. దీంతో, ‘భారత్‌కు అచ్చిరాని ఈ స్టేడియంలోనే కీలక మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించాలి?’ అంటూ అభిమానులు SMలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
CTR: విజయపురం మండలం కొసలనగరం మీట్టురు ఆశ్రమం నందు మంగళవారం శ్రీ రామక్కమ్మ 46వ ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాకులు వాసుదేవస్వామి పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు అఖండనామ భజనలతో ప్రారంభమవుతాయాని తెలిపారు. ఈ సందర్భంగా యజ్ఞం, కోలాటభజనలు, వీధినాటకాలు, ప్రదర్శనలు అమ్మవారి ఊరేగింపు అన్నదానం కార్యక్రమాలు ఉంటాయని వాసుదేవస్వామి వెల్లడించారు.
కడప: జిల్లా పులివెందులలో మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్ రేపటి నుంచి రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న నందిపల్లిలో నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు.పర్యటన సందర్భంగా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
KRNL: నందవరం మండల టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్ ఖాసింవలి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ద్వారా జగన్ ప్రభుత్వం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. పవిత్రమైన తిరుమల ప్రతిష్ఠను మంటగలిపేలా అప్పటి పాలకులు వ్యవహరించారన్నారు.
MLG: జిల్లా కేంద్రంలోని పోట్లపూర్ గ్రామంలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోత్ రవి చందర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
GDWL: గట్టు మండలం చాగదోన గ్రామానికి చెందిన రంగస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. అయిజలోని బ్యాంకులో ఆయన చేయించుకున్న PMSBY బీమా పథకం ద్వారా రూ.2 లక్షల మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని బ్యాంకు మేనేజర్ రుద్ర గౌడ్ సోమవారం మృతుడి భార్య మాధవికి అందజేశారు. ఈ నగదును పిల్లల భవిష్యత్తుకు వాడాలని సూచించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర స్టేట్ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది కొరతపై అసహనం వ్యక్తం చేసి, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్ సమక్షంలో రికార్డులను పరిశీలించి, ప్రజలకు అన్ని సేవలు సమయానికి అందించాలని సూచించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ వల్లే మళ్లీ తనలో మార్పు మొదలైందని తెలిపింది. ‘వివాహ బంధం ముగిసిన తర్వాత ఇక ఎవరినీ నమ్మడం సాధ్యం కాదేమోననిపించింది. ఎందుకంటే ప్రేమ, స్నేహం అంగీకరించలేనంద బలహీనంగా మారిపోయా. రాజ్ నిడుమోరును కలిశాకే నాలో మార్పు వచ్చింది. రాజ్ అలాంటి ప్రేమను పంచిన వ్యక్తి’ అని చెప్పుకొచ్చింది.
అన్నమయ్య: రాయచోటిలో అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. కొత్తపల్లి ప్రాంతానికి చెందిన ఖలీద్ (22) పై కత్తితో దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన ఖలీద్‌ను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగిందని బాధితుడు తెలిపినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG: రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై, రైతు భరోసా నిధులు విడుదలపై మంత్రులు చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.