W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ పర్యటించిన వైద్య సిబ్బంది పలువురు చిన్నారులు, వృద్ధులు, గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. ఇందులో పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎం లక్ష్మి, హెచ్ఎ కృష్ణ, అంగన్వాడీలు సువర్ణ, విజయమ్మ, పైలట్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.
మోహన్ బాబు ఫామ్‌హౌజ్‌లో పోలీసుల విచారణ ముగిసింది. మోహన్ బాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మనోజ్ మీద జరిగిన దాడిపై ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మనోజ్, మౌనికతో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ మాయం కావటంపై పోలీసులు ఆరా తీశారు. ఫుటేజ్ అప్పగించాలని మోహన్ బాబును ఆదేశించారు. మనోజ్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
నంద్యాల: బేతంచెర్ల సమాజంలోని యువత చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ డీ.వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం బేతంచెర్లలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై సీఐ అవగాహన కల్పించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే 100కు ఫోన్ చేయాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యంతో చదివి ఎదగాలన్నారు.
W.G: పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఆయన వెంట స్థానిక రెవిన్యూ సిబ్బంది, ఇతర సిబ్బంది ఉన్నారు. అనంతరం జేసీ ఇరగవరం మండలం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
AKP: గొలుగొండ మండలం సీహెచ్. నాగాపురంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి కే.సుధారాణి రైతుల వరి పొలాలను పరిశీలించి ప్రస్తుతం వరి కోతల చేస్తున్న సమయంలో రైతలు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు BRS నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, వారు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. మాజీ ఎంపీపీ కుమార్ గౌడ్, జిల్లా AMC మాజీ వైస్ ఛైర్మన్ ముసిపట్ల విజయ ఉన్నారు.
WGL: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ కార్యకర్తలు మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారాన్ని నేడు నిర్వహించారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గిరి ప్రసాద్ కాలనీలో వన్ టౌన్ కార్యదర్శి రావుల రాజు ఆధ్వర్యంలో ప్రదర్శన చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
KRNL: భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మొదలైన రద్దీ రోజులలో కూడా నిర్దిష్ట వేళలలో శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, 11:45 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కులు జిల్లాలో బస్సు లోయలో పడి డ్రైవర్ మరణించాడు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BHPL: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం నిర్వహించే ఆశ్రమాలు, పాఠశాలలు సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ దివ్యాంగులు,వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2016 ప్రకారం రిజిస్ట్రేషన్ కొరకు ఈనెల 30వ తేదీలోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణను ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. టీడీపీ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్తున్న కారణంగా సరిపూటి రమణకు సత్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ ఆదినారాయణ పాల్గొన్నారు.
ASR: పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ రూ.3లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. కొర్రా లక్ష్మి, పెద్ద కుమారుడు సంతోష్, కూతురు అంజలి విద్యుత్ ప్రమాదంలో సోమవారం మృతి చెందిన ఘటన విధితమే. ఈమేరకు జాయింట్ కలెక్టర్ అభిషేక్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ చేతుల మీదుగా అందజేశారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం నుంచి కోడూరు-కొమ్మాల మధ్య జరుగుతున్న రోడ్డు పనులు మంగళవారం ఎమ్మెల్యే సామేలు పర్యవేక్షించారు. రోడ్డుకి ఇరువైపులా నిర్మించిన బ్రిడ్జిలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో కూడిన రోడ్డు వేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిషేక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
ATP: భూసమస్యలతో పాటు ప్రజలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని యాడికి తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి అన్నారు. యాడికి మండలం నగరూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారి వీర్రాజు మాట్లాడారు. కేవలం భూ సమస్యలే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ASR: ఈనెల 13వ తేదీ నుండి జనవరి 10వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని పాడేరు మండల తహసీల్దార్ వంజంగి త్రినాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పాడేరు మండలంలో 26పంచాయతీల సచివాలయం పరిధిలో ఉదయం 9.30గంటల నుండి సాయంత్రం 5గంటలకు వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుండి వినతులు స్వీకరించి భూమి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.