TG: కవులు, మేధావులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే ఉద్యమకారులు గుర్తొస్తారని తెలిపారు. తమకు గడీల తల్లి కాదని.. గరీబోళ్ల తల్లి కావాలన్నారు. తెలంగాణ తల్లిని ప్రజలందరూ ఆమోదిస్తే కొందరు మాత్రం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ADB: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులకు గంటలోపు జీవో విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సర్వ శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
JN: జిల్లాలో గల అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో గల అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన అధికారులు, DMHO, DWO, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
SKLM: భూసమస్యలన్ని పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం మడపాం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి-మీ హక్కు రెవిన్యూ సదస్సులో పాల్గొన్నారు. ప్రజల భూ సమస్యలన్ని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నారు.
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 6,950 పలకగా నేడు రూ.50 తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి ధర రూ. 6,900 ధర పలికింది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావాలని, తేమలేని నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట్ మండలం ముస్తాపూర్ వద్ద మక్కల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ నుంచి మక్కల లోడుతో కామారెడ్డి వెళ్తున్న లారీ.. ముస్తాపూర్ మూలమలుపు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: విభజన అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో చర్చకు నోటీసులు ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో శ్రద్ద తీసుకోవాలని సూచించారు.
AP: రాజధాని పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రూ. 11467 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం రెండు రోజుల్లో పిలవనుంది.
KDP: కలసపాడు మండలంలో నూతన ఎస్సైగా నియమితులైన ఘనా మద్దిలేటిని మంగళవారం మండల టీడీపీ నాయకుడు బాలిరెడ్డి మర్యాదపూర్వకంగా కలశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజులపాటు మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీడీవో కుసుమ కుమారి తెలిపారు. 12, 13వ తేదీలలో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఉదయం సాయంత్రం వరకు రెండు బ్యాచ్ల చొప్పున శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు.
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 స్టూడెంట్ వీసాలో 38% తగ్గుదల కనిపించినట్లు ఓ నివేదిక తెలిపింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 64,008 మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ చేశారట. గతేడాది ఇదే సమయంలో 1,03,495 వీసాల జారీ అయ్యినట్లు పేర్కొంది.
CTR: పుంగనూరు రూరల్ మిట్టచింతవారి పల్లిలో మంగళవారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఫ్రీ హోల్డ్, మ్యుటేషన్, డీకేటి, రీ సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజల నుంచి MRO రాము వినతులు స్వీకరించారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్ చిట్టెమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు వీరుపాక్షి, RI ఫణికుమార్, అధికారులు పాల్గొన్నారు.
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమినే భారత అత్యుత్తమ బౌలర్ అని వెస్టిండీస్ దిగ్గజ పేసర్ ఆండీ రాబర్ట్స్ అన్నాడు. ‘షమి కొంతకాలంగా భారత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అతడు బుమ్రా అన్ని వికెట్లు పడగొట్టకున్నా.. అతని వద్ద అన్ని అస్త్రాలు ఉన్నాయి. బుమ్రా వలే బంతిపై మంచి నియంత్రణ ఉంది. ఆసీస్‌తో జరిగే మూడో టెస్టులో షమిని ఆడించాలి’ అని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
WGL: బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఖిలా వరంగల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించడం బాధాకరమన్నారు.
SRD: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో బాగా రాణించాలని ఎంపీడీవో సత్తయ్య, తహసీల్దార్ AN ఖాన్ అన్నారు. మంగళవారం స్థానిక గురుకులం పాఠశాల వద్ద మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కీడాకారులతో పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయ స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు.