MDCL: మౌలాలి పరిధి బండ చెరువు ప్రాంతంలో ఆక్రమణలు జరిగినట్లు అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో గతంలో నాలా ఉందని, దీనిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. చెరువులను కాపాడుతామని చెబుతున్న హైడ్రా, తమ చెరువును సైతం కాపాడాలని బండ చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ విజ్ఞప్తులు పంపుతున్నారు.
NLG: నల్లగొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో పెందోటి సైదులు నివాస ఆవరణంలో గురువారం రాత్రి 22 గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాయి.గ్రామంలో కుక్కలు పెద్ద ఎత్తున స్వైర విహారం చేస్తూ మనుషులపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కుక్కలను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
SRPT: హుజూర్‌నగర్ పట్టణానికి మరో రింగ్ రోడ్డు రాబోతోంది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుండడంతో రెండో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హుజూర్‌నగర్‌లోని 167వ జాతీయ రహదారికి అనుసంధానంగానే రెండో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. కాగా నూతనంగా నిర్మించనున్న రింగ్ రోడ్డు గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్ – శ్రీనగర్ కాలని వరకు నిర్మించనున్నారు.
VZM: రేగిడి ఆమదాలవలస మండలంలోని కొన్ని RSK కేంద్రాల్లో సాంకేతిక కారణాల వల్ల ధాన్యం కొనుగోళ్లు రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఉణుకూరు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉణుకూరు, పోరాం, ఒప్పంగి గ్రామాల రైతులు కొనుగోళ్లు అవ్వక పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం పొలాల్లోనే ఉండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
KDP: చెన్నూరు మండల వెలుగు కార్యాలయంలో జాతీయ లింగ సమానత్వంపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఏపిఎం వెంకటేష్ హాజరయ్యారు. వారు డోక్రా మహిళలతో మాట్లాడుతూ.. సమాజంలో స్త్రీ, పురుష మధ్య సమానత్వం ఉండాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డిని, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వోసీ-2 ప్రభావిత ప్రాంత రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని వినతిపత్రం అందజేశారు. సింగరేణి అభివృద్ధికి సహకరించిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
HYD: నగరంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగకపోవడంతో రద్దీ విపరీతంగా ఉంటుందని ప్రయాణికులు, విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెహదీపట్నం, అత్తాపూర్, చేవెళ్ల, మోయినాబాద్ ప్రాంతాలకు వెళ్లే వారు, రోజూ చాలా సమయం వేచి ఉంటున్నట్లు తెలిపారు.
HNK: శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడంలో పురుషులు ముందు ఉండాలని DMHO డా. అప్పయ్య శుక్రవారం సూచించారు. vasectomy పక్షోత్సవాలలో భాగంగా NOV-21 నుంచి DEC-4 వరకు పురుషులకు కోత కుట్టులేని NSV ఆపరేషన్ పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతగా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉదయం 8:11 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: కూడేరు పీఏబీఆర్ వద్ద కుడికాలవ గేట్లు స్తంభించిపోయాయి. దీంతో కుడి కాలువకు నీటి విడుదల మళ్లీ వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. విజయవాడకు చెందిన అధికార బృందం కుడి కాలువ గేట్లను మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు ఎస్.ఈ సుధాకర్ రావు శుక్రవారం తెలిపారు. HLC ద్వారా 40 క్యూసెక్కుల నీరు డ్యామ్ లోకి చేరుతుందని తెలిపారు.
ATP: శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు CM చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన ముఖ్య అంశాలపై ఈ సందర్భంగా ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ పార్థసారధి పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ జనార్దన్ రెవెన్యూ శాఖలో MCగా విధి నిర్వహించారు. గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయం వైపు మారారు. నార్నూర్ నుంచి బరిలో దిగి ZPTCగా గెలుపొందిన ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆయన దేనికి పోటీచేయనున్నారో అనే దానిపై మండలంలో చర్చనీయాంశంగా మారింది.
నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,28,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,17,750 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,83,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే షెల్టర్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయించాలని ఆదేశించారు
KRNL: నందికొట్కూరుకు చెందిన సురేంద్రబాబు (ప్రమోద్) బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుమారుడి నేత్రాల ద్వారా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించాలనుకున్న తల్లిదండ్రులు కళ్లు దానం చేసేందుకు అంగీకరించారు.