ADB: పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం కప్ 2024 క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ శ్యామల దేవి మంగళవారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతు భరోసా రూ.20 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని స్పష్టం చేశారు. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. దళారులు రైతులను దోచుకు తింటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం ఆగదని చెప్పారు.
AP: అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అక్కను బ్రతికించుకునేందుకు ఓ తమ్ముడు వినూత్న రీతిలో ప్రదర్శన చేస్తున్నాడు. కడపకు చెందిన వెంకటేష్ అనే యువకుడి సోదరి SLE అనే అరుదైన వ్యాధి భారీన పడింది. దీంతో తనను కాపాడుకునేందుకు వెంకటేష్ టెడ్డీబీయర్ వేశంలో పవన్ కళ్యాణ్ ఫొటోను పట్టుకొని తన సోదరికి ఆర్థికంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
VZM: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేశారు. ఈసందర్బంగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు జంధ్యాల బుచ్చిబాబు వారికి ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ మేరకు RBS జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బుచ్చిబాబుని వాళ్ళు దుస్సాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ నెల 13న ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్‌కు వెళ్లనున్నారు. మహాకుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రయాగ్ రాజ్‌లో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సుందరీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాని ప్రయాగ్ రాజ్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.
NZB: రాష్ట్రంలో ప్రజా కంటకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మాజీ MLA నల్లమడుగు సురేందర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలను మార్చడాన్ని నాకు నిరసనగా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మంగళవారం గత తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాన్ని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల: ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల పర్ష రాములు అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు మంగళవారం వినతిపత్రం అందించారు. జిల్లా అధికార ప్రతినిధి రమేశ్, కార్య దర్శి మల్లేశం, అరుణ్, తేజ, కర్ణాకర్, మహేశ్, బాలయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
NLR: ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం చెందిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పాలన చేతకాక మాపై నిందలు వేస్తున్నారన్నారు. రైతు సమస్యలపై ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
NLG: చిలుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ బయో సైన్స్ ఫోరం వారు నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో కీర్తి ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ స్థానం సాధించగా, తెలుగు మీడియంలో నరేందర్ మొదటి బహుమతి గెలుచుకున్నట్లు హెచ్ఎం కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు.
ADB: కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1000 కోట్లతో కుమ్మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకులు కోడూరు చంద్రయ్య కోరారు. మంగళవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. కుమ్మరి కులస్తులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని, కుమ్మరి వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన కుమ్మరి కులస్తులకు ప్రభుత్వం రూ.5000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.
TG: కవులు, మేధావులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే ఉద్యమకారులు గుర్తొస్తారని తెలిపారు. తమకు గడీల తల్లి కాదని.. గరీబోళ్ల తల్లి కావాలన్నారు. తెలంగాణ తల్లిని ప్రజలందరూ ఆమోదిస్తే కొందరు మాత్రం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ADB: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులకు గంటలోపు జీవో విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సర్వ శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
JN: జిల్లాలో గల అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో గల అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన అధికారులు, DMHO, DWO, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
SKLM: భూసమస్యలన్ని పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం మడపాం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి-మీ హక్కు రెవిన్యూ సదస్సులో పాల్గొన్నారు. ప్రజల భూ సమస్యలన్ని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నారు.
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 6,950 పలకగా నేడు రూ.50 తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి ధర రూ. 6,900 ధర పలికింది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావాలని, తేమలేని నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.