BPT: మంగళవారం బాపట్ల చేరుకున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని రెవెన్యూ శాఖపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
తన సేవలు గుర్తించి బీజేపీ అవకాశం ఇచ్చిందని బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను పార్టీలు మారటం లేదని.. పార్టీలే తన దగ్గరకు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు బీసీలకు ఏం చేయాలన్నా బీజేపీతోనే సాధ్యమని.. బీసీల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప...
KMR: మద్నూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రికి, జూనియర్ కళాశాల, గురుకుల బాలుర పాఠశాల కోసం ఇనాని కుటుంబ సభ్యులు భూదానం చేయడం గొప్ప విషయమని ఎంపీడీవో రాణి అన్నారు. మంగళవారం పాత బస్టాండ్ వద్ద సేఠ్ రాం ప్రసాద్ ఇనాని జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, ఇనాని కుటుంబ సభ్యులు ఉన్నారు.
కృష్ణా: విజయవాడలోని గుణదల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం తొలగించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దాన్య ఆదేశాల మేరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి వసీం బేగ్ హెచ్చరించారు.
SRD: తెలంగాణ తల్లి విగ్రహరూపరేఖలను ప్రభుత్వం మార్చడం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూరలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రూపొందించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ADB: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా వంద శాతం కుటుంబాల వివరాలను ఆపరేటర్లు సమగ్ర సర్వే వెబ్‌సైట్లలో నమోదు చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2,25,257 కుటుంబాలున్నట్లుగా హౌస్ లిస్టింగ్ సర్వేలో అధికారులు గుర్తించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఎదుట మంగళవారం ఉష అనే మహిళ ధర్నా చేపట్టింది. తనను వాచ్‌మెన్ విధుల నుండి ఆ కారణంగా తొలగించారని డబ్బులకు ఆశపడి వేరే మహిళను తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని తెలిపింది.
నంద్యాల: జిల్లాలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉప్పెనలా సాగుతుంది. 38వ వార్డు ఇంఛార్జ్ దేరెడ్డి శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రజలకు టీడీపీ సభ్యత్వం నమోదును చేయిస్తున్నారు. దేరెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్యత్వ నమోదు ప్రజల నుంచి అమోఘ స్పందన లభిస్తుంది.
W.G: తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక రాంప్ వద్ద సీడీంగ్ నిమిత్తం అక్రమంగా ఏర్పాటు చేసిన జేసీబీని కొవ్వూరు ఆర్డీవో సుస్మిత మంగళవారం సీజ్ చేశారు. ఈ ర్యాంపును ఆర్డీవో సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ర్యాంపుల వద్ద ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
W.G: తాడేపల్లిగూడెం ప్రాంతీయ ప్రెస్‌క్లబ్ నూతనంగా ఏర్పాటైంది. మంగళవారం స్థానిక కార్యాలయంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కమ్ముల రాయుడు, ప్రధాన కార్యదర్శిగా కట్టుంగ శ్రీను ఎన్నికయ్యారు. మరో పది మంది సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
సంగారెడ్డి: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో మంగళవారం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అనంతరం సమగ్ర శిక్షా ఉద్యోగులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బేతాపల్లి గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళ అనారోగ్య సమస్యతో విషద్రావణం తాగి మంగళవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్నా ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్‌కు వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమై.. అక్కడి నుంచి రాజస్థాన్‌కు చేరుకోనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి సీఎం అక్కడకు వెళ్లనున్నారు. ఈ నెల 11,12,13 తేదీల్లో అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ బంధువుల పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ఈ పర్యటన ఖరారైనట్లు సమాచారం.
ATP: గార్లదిన్నె మండలంలోని కేశవాపురం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిన రెవెన్యూ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల గురించి భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.
సత్యసాయి: లేపాక్షి మండల పరిధిలోని సిరివరం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మంగళవారం గ్రామంలోని సచివాలయ ఆవరణంలో రెవెన్యూ సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.