• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీసీ రోడ్డు మరమ్మతులు చేయించిన కౌన్సిలర్

BHNG: భువనగిరి 28వ వార్డు మీనానగర్లో దెబ్బతిన్న రోడ్డుకు కౌన్సిలర్ సూదగాని సరిత రాజు సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. వినూత్న హాస్పిటల్ నుంచి కేజేఆర్ టాకీస్ వరకు రహదారి శిథిలావస్థకు చేరి వాహనదారులు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిధుల కోసం వేచి చూడకుండా, ప్రజా సౌకర్యార్థం ఆమె తక్షణ చర్యలు చేపట్టారు. ఈ చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

February 24, 2026 / 08:10 AM IST

ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు ఇలా..

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్‌లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.16, వంకాయ రూ.26, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.36, బీరకాయ రూ.36, సొరకాయ రూ.16, దొండకాయ రూ.36, క్యాబేజీ రూ.20, ఆలుగడ్డ రూ.22, చామగడ్డ రూ.46, క్యారెట్ రూ.26, కీరదోస రూ.36, బీన్స్ రూ.56, క్యాప్సికం రూ.56, ఉల్లిగడ్డలు రూ.25, కోడిగుడ్లు(12) రూ.75గా ఉన్నాయి.

February 24, 2026 / 08:10 AM IST

ప్రభుత్వ సలహాదారుడుని కలిసిన నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్

NZB: బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని ఆర్మూర్ మున్సిపల్ నూతన ఛైర్పర్సన్ గోనే లహరి రఘు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న జరగనున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని ఆమె ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి ఉన్నారు.

February 24, 2026 / 08:10 AM IST

నేడు హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ పర్యటన

SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాళ హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు హుజూర్‌నగర్ చేరుకుని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న హౌజింగ్ కాలనీని పరిశీలించనున్నారు. అనంతరం చింతలపాలెం మండలం దొండపాడు, పాలకవీడు మండలం జాన్పహాడ్లోని లిఫ్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

February 24, 2026 / 08:07 AM IST

ఈ నెల 28న బండలాగుడు పోటీలు

NDL: నందికొట్కూరు మండలం కొణిదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నెల 28న బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.40 వేలు, వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేల నగదు పురస్కారాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎద్దుల యజమానులు ఈ పోటీల్లో పాల్గొనాలని వారు కోరారు.

February 24, 2026 / 08:04 AM IST

‘నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు’

W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అలాగే, నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరగాలన్నారు. అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని సూచించారు.

February 24, 2026 / 08:04 AM IST

నేడు వీడనున్న ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ!

HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను ఛైర్మన్‌గా ఎన్నికైనందున వెంటనే తనను ఛైర్మన్‌గా ప్రకటించాలని ఇప్పటికే సుదర్శన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

February 24, 2026 / 08:04 AM IST

వృద్ధుడి ఆత్మహత్య

JGL: పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాచకొండ ధర్మయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మయ్య కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. దవాఖానలో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో సోమవారం ఇంట్లోనే దూలానికి ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు

February 24, 2026 / 08:04 AM IST

రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదు: బ్రహ్మానంద్

ADB: తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. బాన్స్ వాడలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ పట్టణంలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:03 AM IST

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కి 2898ఏడీ’. భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ శంకర్‌పల్లి సమీపంలో అమితాబ్ బచ్చన్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈనెలాఖరు నుంచి ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. కమల్‌హాసన్ మార్చి తర్వాత సెట్‌లోకి వస్తారు.

February 24, 2026 / 08:03 AM IST

నేటి నుంచి ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

SKLM: రణస్థలం మండలం కొండములగాం ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పొట్నూరు శ్రీధర్ తెలిపారు. ఆన్లైన్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ‘apms.apcfss.in’ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 08:02 AM IST

జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన ఎమ్మెల్యే

NLG: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో 99. 56 పర్సంట్తెల్ సాధించిన రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు ముక్కా చరణ్ సాయి గౌడ్, ఐ. కృష్ణ చరణ్, 95.63, సిహెచ్ భాను శంకర్ 94.78 విజయ్ చరణ్ 92.52, జె ప్రవీణ్ 92.16 లను. సోమవారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 08:00 AM IST

‘పెండింగ్ కేసుల పరిష్కారం పై దృష్టి సారించాలి’

SKLM: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అపరి ష్కృత కేసుల రాజీ పై దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్‌లో సోమవారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్టేషన్‌లలో పెండింగ్ కేసులు తగ్గాలని బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని అన్నారు.

February 24, 2026 / 08:00 AM IST

ఔషధ దుకాణాలకు నోటీసులు

ELR: ఉభయ గోదావరి జిల్లాల్లోని 44 మెడికల్ షాపులపై సోమవారం ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన పలు దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏలూరు రీజియన్ ఉప సంచాలకులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే మందులు కొనుగోలు చేయాలని సూచించారు.

February 24, 2026 / 07:57 AM IST

విద్యార్థులకు చట్టాలపై షీ టీమ్ అవగాహన

NRPT: దామరగిద్ద మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ (SHE Teams) పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, ర్యాగింగ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి స్వయం సమృద్ధి సాధించాలని పోలీసులు బాలరాజ్, చెన్నప్ప, జ్యోతి పేర్కొన్నారు.

February 24, 2026 / 07:56 AM IST