• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జంట జలాశయాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ

HYD: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నగరానికి తాగునీటి వనరులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరుతున్నాయన్న ఆరోపణలపై జలమండలి సహా సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చి, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

February 24, 2026 / 06:27 AM IST

మరి కాసేపట్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు

కృష్ణా జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3, సిట్టింగ్‌ 3 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి.

February 24, 2026 / 06:26 AM IST

‘శత శాతం అక్షరాస్యత సాధించాలి’

అనకాపల్లి: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 93,056 మంది నిరక్షరాస్యలను గుర్తించామన్నారు. వీరికి చదువు చెప్పేందుకు 9,351 మంది వాలంటీర్లను నియమించామన్నారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్పించాలన్నారు.

February 24, 2026 / 06:25 AM IST

మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్‌కు జైలు

తిరుపతి: శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో DSP నరసింహమూర్తి ఆధ్వర్యంలో సీఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి తిరుపతి-నాయుడుపేట బైపాస్‌లో బ్రీత్ అనలైజర్‌తో తనిఖీలు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ జానయ్య మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 12 రోజులు జైలుశిక్ష విధించారు.

February 24, 2026 / 06:22 AM IST

ఉపాధి బిల్లుల నమోదుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ATP: ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ బిల్లులను ప్రత్యేక శ్రద్ధతో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జేసీ విష్ణు చరణ్‌తో కలిసి పలు పథకాలపై సమీక్షించారు. జిల్లాలో మిగిలి ఉన్న 44.48 కోట్ల రూపాయల బిల్లులను మార్చి 10వ తేదీలోపు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

February 24, 2026 / 06:22 AM IST

నేటి నుంచి పులివెందులలో జగన్‌ పర్యటన

AP: YCP చీఫ్ జగన్‌ ఇవాళ్టి నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్‌ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అలాగే ఎల్లుండి వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రజాదర్బార్‌కు హాజరవుతారు.

February 24, 2026 / 06:20 AM IST

నేడు మంత్రి జూపల్లి పర్యటన వివరాలు

WNP: పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.

February 24, 2026 / 06:20 AM IST

నేడు విధులు బహిష్కరించనున్న న్యాయవాదులు

NLR: కర్నూలులో న్యాయవాది పవన్ కుమార్‌పై అక్కడి 4వ నగర పట్టణ సీఐ దాడిని ఖండిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. న్యాయవాదులంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

February 24, 2026 / 06:20 AM IST

అదనపు కట్నం వేధింపులు.. కేసు నమోదు..!

W.G: నరసాపురంలో అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14వ వార్డుకు చెందిన మహమ్మద్ రెహినాకు, మహమ్మద్ షబ్బీర్ 2021 జూన్ 28న వివాహం జరిగింది. పెళ్లైన మరుసటి రోజు నుంచే భర్త షబ్బీర్, మహమ్మద్ నసీమా, మహమ్మద్ నసీర్, మహమ్మద్ జబీన్, సందీప్ రెడ్డి అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులుల తెలిపారు.

February 24, 2026 / 06:19 AM IST

నేడు పసుపు వ్యాపార లావాదేవీలు బంద్

NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. నేడు పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగొళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.

February 24, 2026 / 06:18 AM IST

మార్చి 1న జిల్లా సర్వసభ్య సమావేశం

NDL: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మార్చి 1న కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్, విద్య, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరగనుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు.

February 24, 2026 / 06:18 AM IST

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత

SRCL: వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 120.4 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. కోల మారుతి అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు రూ.55 వేల విలువైన మద్యం సీజ్ చేసి, నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వివరించారు.

February 24, 2026 / 06:18 AM IST

మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి: కలెక్టర్

NRPT: పనిచేసే చోట మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన పోష్ చట్టం అవగాహన వాల్ పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. లైంగిక నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.

February 24, 2026 / 06:16 AM IST

పోలీస్ డాగ్‌కు స్వర్ణ పథకం

KNR: కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన పోలీస్ డాగ్ ‘టైసన్’ రాష్ట్ర స్థాయిలో ఘనత చాటింది. హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఐఐటీఏ శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా టైసన్‌ను, దాని హ్యాండ్లర్ పీసీఈ రాజును సీపీ గౌస్ అలాం అభినందించారు.

February 24, 2026 / 06:16 AM IST

గోరికొత్తపల్లిలో భారీ వర్షం

భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అలాగే భారీ వర్షం వల్ల మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చి చివరి దశలో ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు.

February 24, 2026 / 06:16 AM IST