• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉప్పల్వాయి-కామారెడ్డి రైల్వే గేట్ మూసివేత

KMR: ఉప్పల్వాయి-కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ ఈ నెల 25న బుధవారం రోజు రాత్రి 11 గంటల వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా మూసివేస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు.

February 24, 2026 / 06:34 AM IST

రాష్ట్ర స్థాయిలో మెరిసిన కామారెడ్డి దివ్యాంగ విద్యార్థులు

KMR: జిల్లా దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. HYD లో ఈనెల 17న నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు.12 మంది ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. అథ్లెటిక్స్, షాట్పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్స్‌లో తమ సామర్థ్యాన్ని చాటారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సత్కరించి అభినందించారు.

February 24, 2026 / 06:33 AM IST

చేవెళ్ల మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 100 కోట్లు: మంత్రి

RR: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నిన్న చేవెళ్ల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్, పాలకవర్గ సన్మానసభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య విజ్ఞప్తి మేరకు ఈ నిధులు కేటాయిస్తున్నామన్నారు. వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 06:33 AM IST

నేడు జిల్లాకు రానున్న మాజీ మంత్రి

HNK: పట్టణ కేంద్రంలో ఇవాళ సిద్దిపేట MLA, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించినట్లు BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కాజీపేట చౌరస్తాకు చేరుకుంటారని BRS శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలకాలన్నారు. అనంతరం 11 గంటలకు WGLలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించనున్నారు.

February 24, 2026 / 06:32 AM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్

JN: చిల్పూర్ మండలంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన తొళక్కము ప్రారంభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, సతీమణి మాధురి షాతో కలిసి పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 24, 2026 / 06:31 AM IST

పాతగుంటూరులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

GNTR: పాతగుంటూరు నందివెలుగు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట అడ్డాపై సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు 11 మంది జూదగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి దగ్గర రూ. 80వేల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

February 24, 2026 / 06:31 AM IST

పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

GDWL: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో 8,110 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో మౌలిక వసతులతో పాటు, అత్యవసర వైద్యం కోసం ప్రాథమిక చికిత్స మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు.

February 24, 2026 / 06:31 AM IST

‘చికెన్ వ్యర్ధాలు వినియోగిస్తే చర్యలు తప్పవు’

NLR: చికెన్ వ్యర్ధాలను వినియోగిస్తున్నారని చేపల గుంటలకు కరెంటు సరఫరాను మత్సశాఖ అధికారులు నిలిపివేయించిన ఘటన బుచ్చిలో చోటుచేసుకుంది. కాగులపాడు గ్రామాలలో మత్స్యశాఖ జేడీ కే శాంతి చేపల గుంటలను ఆకస్మిక తనిఖీ చేశారు. 9 మంది రైతులు కోళ్ల వ్యర్ధాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి డ్రమ్ములు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

February 24, 2026 / 06:30 AM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు

SDPT: జిల్లాలోని 42 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

February 24, 2026 / 06:29 AM IST

జంట జలాశయాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ

HYD: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నగరానికి తాగునీటి వనరులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరుతున్నాయన్న ఆరోపణలపై జలమండలి సహా సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చి, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

February 24, 2026 / 06:27 AM IST

మరి కాసేపట్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు

కృష్ణా జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3, సిట్టింగ్‌ 3 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి.

February 24, 2026 / 06:26 AM IST

‘శత శాతం అక్షరాస్యత సాధించాలి’

అనకాపల్లి: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 93,056 మంది నిరక్షరాస్యలను గుర్తించామన్నారు. వీరికి చదువు చెప్పేందుకు 9,351 మంది వాలంటీర్లను నియమించామన్నారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్పించాలన్నారు.

February 24, 2026 / 06:25 AM IST

మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్‌కు జైలు

తిరుపతి: శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో DSP నరసింహమూర్తి ఆధ్వర్యంలో సీఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి తిరుపతి-నాయుడుపేట బైపాస్‌లో బ్రీత్ అనలైజర్‌తో తనిఖీలు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ జానయ్య మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 12 రోజులు జైలుశిక్ష విధించారు.

February 24, 2026 / 06:22 AM IST

ఉపాధి బిల్లుల నమోదుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ATP: ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ బిల్లులను ప్రత్యేక శ్రద్ధతో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జేసీ విష్ణు చరణ్‌తో కలిసి పలు పథకాలపై సమీక్షించారు. జిల్లాలో మిగిలి ఉన్న 44.48 కోట్ల రూపాయల బిల్లులను మార్చి 10వ తేదీలోపు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

February 24, 2026 / 06:22 AM IST

నేటి నుంచి పులివెందులలో జగన్‌ పర్యటన

AP: YCP చీఫ్ జగన్‌ ఇవాళ్టి నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్‌ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అలాగే ఎల్లుండి వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగే నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రజాదర్బార్‌కు హాజరవుతారు.

February 24, 2026 / 06:20 AM IST