ATP: ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ బిల్లులను ప్రత్యేక శ్రద్ధతో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జేసీ విష్ణు చరణ్‌తో కలిసి పలు పథకాలపై సమీక్షించారు. జిల్లాలో మిగిలి ఉన్న 44.48 కోట్ల రూపాయల బిల్లులను మార్చి 10వ తేదీలోపు నమోదు చేయాలని స్పష్టం చేశారు.