• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పుష్కరాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

TG: రాష్ట్రంలో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నది మహా పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భక్తులు పుణ్యస్నానాలకు ఘాట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ, లైటింగ్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

March 2, 2026 / 05:20 PM IST

టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు: సీఐ

KDP: అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని CI నరసింహారాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు గ్రామాలలో కిరాణా షాపులలో ఎటువంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కిరాణా షాపుల యజమానులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

March 2, 2026 / 05:20 PM IST

జనసేన సభ్యత్వ నమోదులో పాల్గొన్న ఎంపీ

KKD: అన్నవరం వేదికగా మేడిశెట్టి సూర్య కిరణ్ బాబి ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MP ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరెంట్ షాక్‌తో మరణించిన గిడజాం జనసైనికుడు యర్రా నాగేశ్వరరావు భార్య సోమిరెడ్డి కుశరాజు సాయంతో ఎంపీని ఆశ్రయించారు. వివరాలు తెలుసుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.

March 2, 2026 / 05:20 PM IST

వాహనాల లైట్లకు బ్లాక్ స్టిక్కర్స్ అతికించాలని వినతి

E.G: వాహనాల LED లైట్ల కారణంగా అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి వాహనం లైట్లకు బ్లాక్ స్టిక్కర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.గిరీష్ కోరారు. సోమవారం రాజమండ్రి ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సత్తిబాబుకు వినతి పత్రం అందించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

March 2, 2026 / 05:20 PM IST

‘తెలుగు భాష నన్ను ఐపీఎస్ సాధించే విధంగా చేసింది’

AKP: తాను అభ్యసించిన తెలుగు భాష ద్వారా ఐపీఎస్ సాధించగలిగానని యూపీ రాష్ట్రం మాజీ ఎడిషనల్ డిజిపి కిల్లాడ సత్యనారాయణ సోమవారం నర్సీపట్నంలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు నాలుగు సార్లు రాస్తే మెయిన్స్‌లో ఫెయిల్ అవ్వడం జరిగిందన్నారు. ఐదోసారి తెలుగులో రాసి ఐపీఎస్ కి ఎంపిక అయ్యానన్నారు. మన భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యమైనది అన్నారు.

March 2, 2026 / 05:19 PM IST

‘పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికాబద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో ఇవాళ ఆయన సీపీ అంబర్ కిషోర్ జాతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. స్నానాల కోసం ఘాట్, రోడ్లు, లైటింగ్, ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

March 2, 2026 / 05:19 PM IST

బాధ్యతలు స్వీకరించిన విజయానంద్

AP: సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్‌గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం ఆయనను సీఎం ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, టీటీడీ వేదపండితుల ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

March 2, 2026 / 05:18 PM IST

ప్రజా ఫిర్యాదుల వేదికకు 33 వినతులు

TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 33 వినతులు అందాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. 23 మంది ప్రత్యక్షంగా,10 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ వార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

March 2, 2026 / 05:18 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

MDK: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కొత్తగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 05:17 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి’

KMM: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

March 2, 2026 / 05:17 PM IST

ఇంటి పన్నులు తగ్గించాలని వినతి

RR: కొత్తూరు మున్సిపాలిటీలో ఇంటి పన్నులు తగ్గించాలని యువ నాయకుడు రవీందర్ యాదవ్, కొత్తూరు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇంటి పన్నుల భారాన్ని భరించలేక పోతున్నారని, మున్సిపాలిటీలో ఇంటి పన్నులు తగ్గించి ఎన్ఆర్ఈజీఎస్ కూలీ పనులు మున్సిపాలిటీలకు వర్తింపజేయాలని కోరారు.

March 2, 2026 / 05:17 PM IST

ప్రజావాణి అర్జీలను తక్షణం పరిష్కరించాలి: కలెక్టర్

ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా శాఖల వారీగా సమీక్షించి, నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

March 2, 2026 / 05:17 PM IST

‘బాల్య వివాహాలు ఆపండి’

BHNG: బాల్య వివాహల నిర్మూలన కొరకు స్కోప్ స్వచ్ఛంద సంస్థ ప్రచార రథం మోత్కూరు మండల కేంద్రంకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవింద రాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మార్వో జ్యోతి హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

March 2, 2026 / 05:16 PM IST

‘వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయం’

KNR: పురపాలక పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని పేర్కొన్నారు. సోమవారం ఆమె 1వ వార్డులో పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మేకల స్వరూప పాల్గొన్నారు.

March 2, 2026 / 05:16 PM IST

అత్యంత కట్టుదిట్టంగా 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ

KMM: ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. MAR 6 నుంచి JUN 12 వరకు ప్రభుత్వ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

March 2, 2026 / 05:16 PM IST