• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎస్పీ కార్యాలయంలో మహిళా ఎస్సైల నృత్యాలు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం రంగుల కేళితో పులకించిపోయింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో మహిళా ఎస్సైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే పాటల హోరులో ఎస్పీతో కలిసి మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్టెప్పులేశారు. సంప్రదాయ పద్ధతిలో రంగులు పూసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

March 3, 2026 / 03:25 PM IST

ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

AP: రాష్ట్ర ఉన్నత విద్యామండలి లాసెట్, పీజీ-ఎల్సెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది లా ప్రవేశ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

March 3, 2026 / 03:25 PM IST

రోడ్డు ప్రమాదం.. తప్పిన ప్రమాదం

తూ.గో: నిడదవోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, నిడదవోలుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాలతో క్షతగాత్రులను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు.

March 3, 2026 / 03:25 PM IST

కేసీఆర్‌తో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ

TG: మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.

March 3, 2026 / 03:24 PM IST

అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత కరెంట్ కనెక్షన్లు: ఎస్ఈ

PDPL: పెద్దపల్లి సర్కిల్లో విద్యుత్ లేని 69 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కేంద్రాలను గుర్తించి, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలతో పాటు విద్యుత్ సేవలను వేగంగా అందిస్తున్నామన్నారు.

March 3, 2026 / 03:24 PM IST

తర్లుపాడులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి నుంచి తుమ్మలచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డుపై మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 03:23 PM IST

‘గిరిజన యువతకు ఉపాధి కల్పించండి’

ASR: ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ కోరింది. మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు వారు వినతిపత్రం అందజేశారు. అలాగే, దేవీపట్నం మండలంలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న తోటల్లో జీడిగింజలు కోసేందుకు గిరిజనులకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

March 3, 2026 / 03:21 PM IST

పంపనూరులో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

ATP: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా రథాన్ని లాగి ఉత్సవాన్ని పురస్కరించుకున్నారు.

March 3, 2026 / 03:20 PM IST

అధికారుల ఒత్తిడికి ప్యాక్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

SRPT: అధికారుల వేధింపులు భరించలేక తెల్లబల్లి ప్యాక్స్ (PACS) ఇన్‌ఛార్జి సీఈవో రాజారావు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రుణ వసూళ్లు, ప్యాక్స్ నిర్వహణపై ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇవాళ తెలిపారు. ప్రస్తుతం రాజారావు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

March 3, 2026 / 03:19 PM IST

‘క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే’

SKLM: పొందూరు మండల పరిధిలో ఉన్న క్వారీ యజమానులతో డీఎస్పీ వివేకానంద మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాస్టింగ్ సమయంలో కార్మికులు, స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మందుగుండు నిల్వ, రవాణా, వినియోగంలో నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

March 3, 2026 / 03:19 PM IST

రానా దగ్గుబాటితో బోయపాటి సినిమా ?

రానా దగ్గుబాటి, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో భారీ యాక్షన్ మూవీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రానాకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ కథ ఆయనకు సరిగ్గా సరిపోతుందని బోయపాటి భావిస్తున్నాడట. గతంలో రణ్‌వీర్ సింగ్‌కు అనుకున్న కథనే మార్పులు చేసి, అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇది రానా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కానున్నట్లు టాక్.

March 3, 2026 / 03:18 PM IST

రాజ్యసభ సీట్లను BRS అమ్ముకుంది: టీపీసీసీ

TG: గతంలో కార్పొరేట్ శక్తులకు BRS రాజ్యసభ అవకాశం ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళలో ఒక్కరికైనా రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామన్నారు. వీటిపై కసరత్తు జరుగుతోందన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

March 3, 2026 / 03:17 PM IST

‘పర్యావరణానికి హాని చేయని రంగులు వాడాలి’

BDK: పర్యావరణానికి హాని చేయని సాధారణ రంగులనే వాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సూచించారు. భద్రాద్రి జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. మంగళవారం మణుగూరు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొని, నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకున్నారు.

March 3, 2026 / 03:17 PM IST

శాంతిఖని గనిలో కార్మికులకు తాగేందుకు నీరు కరువు

MNCL: బెల్లంపల్లి శాంతిఖని గనిలో కార్మికులకు తాగేందుకు గుక్కెడు నీరు కరువైంది. గనిలో నిర్మించిన RO ప్లాంట్ చెడిపోయింది. దీంతో కార్మికులు తాగునీటి సదుపాయం లేక నరకాయతన పడుతున్నారు. ఇంటి వాటర్ బాటిళ్లను వెంట తెచ్చుకుని దప్పిక తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు RO ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి సారించాలి. అప్పటివరకూ తాత్కాలిక తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.

March 3, 2026 / 03:14 PM IST

పెదకాకానిలో ధర్నా చేపట్టిన అంగన్వాడీలు

GNTR: పెదకాకానిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలని, గత సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 03:14 PM IST