TG: హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37℃, కనిష్ఠం 26℃ వరకు నమోదు కానుందని, వాయవ్య దిశ నుంచి గంటకు 4- 6 కి.మీల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.