TG: కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇళ్లపై ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టకూడదు? అని ప్రశ్నించారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే వారికి కడుపు నొప్పి ఎందుకు? అని అడిగారు. ప్రధానిగా మోదీని గౌరవిస్తాం.. కానీ ఇందిరమ్మ త్యాగం ముందు మోదీ ఎంత? అని అన్నారు.