చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జీఎస్టీ విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలు, సామన్యులు అధికంగా వాడే వస్తువులపై 5 శాతం జీఎస్టీ విధించాం. అన్నీ టీవీలపై 18 శాతం, వ్యవసాయ పరికరాలపై ఉన్న 12 శాతం GSTని 5 శాతానికి తగ్గించాం. చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం, సిమెంట్‌పై ఉన్న 28 శాతం GSTని 18 శాతానికి కుదించాం’ అని వెల్లడించారు.