TG: నిజామాబాద్లో బీజేపీ పార్లమెంటరీ స్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను పార్టీ తరఫున ఎంపీలు ఘనంగా సన్మానిస్తారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.