TG: హైదరాబాద్ నుంచి బాసరకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రికి చేరుకుంటారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సీఎం పిప్రిలో బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు.