ఈ మధ్య విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. పక్షుల్లో కూడా విడాకులు పెరుగుతున్నట్లు తెలిసింది. మనుషుల మాదిరిగానే పక్షులు కూడా జీవితాంతం ఒకే భాగస్వామితో కూడి ఉంటాయని మనకు తెలుసు. చాలా మంది కూడా అదే నిజమని నమ్ముతారు. అయితే సమాజంలో మనుషులు అభిప్రాయ బేధాలు వచ్చి ఎలా విడిపోతున్నారో పక్షులు కూడా కొన్ని కారణాలతో విడిపోతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే మనుషుల్లానే అవి కూడా విడాకులు(Divorce) తీసుకుంటున్నాయి అంటున్నారు.
పక్షులు కూడా మనుషుల మాదిరిగానే ఆకర్షణకు గురి అవుతాయి. అందుకే చాలా పక్షి జాతులను గమనిస్తే తమ వద్ద ఉన్న ప్రతిభను కనబరిచి ఇతర పక్షులను అట్రాక్ట్ చేస్తాయి. ఉదాహారణకు కొన్ని పక్షులు పాడుతాయి, కొన్ని అందమైన విన్యాసాలు చేస్తాయి. ఇలా పక్షులు కూడా తమ ప్రేమను రకరకాలుగా ప్రదర్శిస్తాయి. అలాగే భాగస్వామి ఉన్నప్పటికీ వేరే పక్షికి పడిపోతాయి. ఇక వీటి విడాకులకు ఇది కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారం కోసం సుదూర ప్రాంతాలకు పక్షులు వలసపోతాయి. అలా పక్షుల మధ్య దూరం పెరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో పక్షుల విడిపోతాయి. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఇవి విడిపోయే ప్రక్రియ కాస్త వింతగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పక్షి జాతుల్లో 90 శాతం పక్షులు జీవితంలో ఒకే భాగస్వామినతో ఉంటుండగా.. కొన్ని పక్షులు మాత్రం తమ జీవిత భాగస్వామి ఉండగానే కొత్త బంధాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇలా మోనోగామి (Monogamy) ని కాదని ఇతర పక్షులతో కూడా జతకట్టే పక్షుల సంఖ్య పెరగడాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ పరిణామాల వెనక ఉన్న కారణాలను కనుగొనేందుకు చైనా, జర్మనీ శాస్త్రవేత్తలు ఇటీవలే పరిశోధనులు కూడా జరిపారు. నిపుణులు చెప్పిన ప్రకారం మగ పక్షులు ఇతర ఆడ పక్షులతో జతకట్టడం, తమ జీవిత భాగస్వామిని విడిచి ఆహారం కోసమని వలస పోయినప్పుడు కూడా ఇతర పక్షలతో సంగమించడం చేస్తున్నాయని గుర్తించారు. ఈ రీసెర్చ్ లో భాగంగా శాస్త్రవేత్తలు 232 జాతుల పక్షులను పరిశీలించారు. వాటి వలస విధానాన్ని, విడాకుల రేటును, సంతానోత్పత్తి రేటును ఇలా పలు అంశాలను నమోదు చేసుకున్నారు. వాటి పూర్వ చరిత్రను బట్టి మగ పక్షి, ఆడ పక్షికి సంబంధించి లైంగిక సంబంధాలు ఎలా ఉన్నాయో గమనించారు. అందులో విడాకులు ఎక్కువ తీసుకుంటున్న పక్షి జాతులను గుర్తించారు.
ప్లోవర్, స్వాలోస్, మార్టిన్స్, ఓరియోల్స్, బ్లాక్ బర్డ్స్ జాతి పక్షుల్లో మగ పక్షులు ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు కనుగొన్నారు. మరోవైపు పెట్రెల్స్, ఆల్బట్రోసెస్, గీస్, స్వాన్స్ మొదలైన పక్షుల్లో మగ పక్షులు ఇతర పక్షుల పట్ల ఆకర్షణ లేకుండా తమ భాగస్వామితోనే కలిసి ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఈ మొత్తం ప్రయోగంలో ఆడ పక్షి వ్యవహారం చాలా వింతగా ఉంది. ఆడ పక్షులు ఇతర పక్షుల పట్ల సంబంధాలు పెట్టుకొని కూడా తమ భాగస్వామితోనే కలిసి ఉండగా చాలా వరకు మగ పక్షలు వేరే పక్షులతో సంబంధాలు పెట్టుకొని తమ జీవిత భాగస్వామితో విడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. మగ పక్షుల లైంగిక సంబంధాలే విడాకులకు దారి తీస్తున్నాయని, అందుకు ఆడ పక్షుల సంఖ్య అధికంగా ఉండడం, అలాగే ఆడ పక్షులు ఎక్కవ ఆకర్ష శక్తిని కలిగి ఉండడం అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ప్రొఫెసర్ డా.జిటన్ సంగ్ వెల్లడించారు. సంతానోత్పత్తి సీజన్ గడిచిపోయాక.. మగ పక్షి తన భాగస్వామి పక్షిపై ఆసక్తి చూపించడం లేదని ఈ కారణంగానే పక్షుల్లో విడాకులు ఎక్కువ అవుతున్నట్లు కనుగొన్నారు.
ఇక లైంగిక సంబంధాలు ఎక్కువ పెట్టుకున్న మగ పక్షులు ఎక్కువ ఆరోగ్యంగా ఫిట్ గా ఉండి ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తితో పాటు, ఆడ పక్షులకు ఆకర్షణియంగా కనపడుతున్నాయన్నారు. ఆడ పక్షుల లైంగిక సంబంధాల దగ్గరకి వస్తే.. వీటి బంధాలు విడాకులకు దారి తీయకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్ల ఆడ పక్షిని దూరం చేసుకుంటే గుడ్లను పొదగడం, వాటిని రక్షించడం, ఆహారం తీసుకురావడం, పెట్టడం వంటి బాధ్యతలు మగపక్షి నెత్తిన పడతాయని వెల్లడించారు.
అయితే పక్షుల్లో విడాకులకు వలస (Migration)లూ ముఖ్యం కారణంగా తెలుస్తుంది. వలసల కోసం ఎక్కువ దూరం వెళ్లిన పక్షులు తిరిగి వచ్చి తమ భాగస్వామితో కలవడానికి ఇష్టపడనట్లు, అలాగే జతగా వెళ్లిన పక్షులు జతగా తిరిగి రాకపోవడంతో అవి ఇతర పక్షులతో కూడినట్లు.. అందుకే వలసల కారణంగా పక్షుల్లో ఎక్కవ విడాకులు జరుగుతున్నట్లు డా.జిటన్ తెలిపారు.