Is it true that eating tomatoes can cause kidney stones?
సామాన్యులకు అందుబాటులో ఉండే టమాటా గత కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చుంది. మార్కెట్ లో వీటి ధరలు చికెన్ రేట్లను తలపిస్తున్నాయి. దీంతో టమాట లేని కూరల మీద ప్రయోగాలు చేస్తున్నారు మధ్యతరగతి మహిళా మణులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేటు రూ. 100 దాటగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రూ. 160 పలుకుతోంది. ఈ తరుణంలో చోరనిపుణులు తమ చేతివాటం చూపిస్తున్నారు. టమాటాలను దొంగలించడానికి తమ మాస్టర్ మైండ్లకు పనిపెడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ డోర్నకల్ లోని మార్కెట్ లో ఓ రైతుకు చెందిన 20 కేజీల టమాటాలను, 4 కేజీల మిర్చి మరో నాలుగు రకాల కూరగాయలను దొంగతనం చేశారు. ఈ విషయంపై బాదితుడు మార్కెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తం అయిన మార్కెట్ సభ్యులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు.
ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో కూడా చోటు చేసుంది. హళేబీడు ప్రాంతంలో ఓ రైతు పొలంలో ఏకంగా 60 బస్తాలా టమాటాలను చోరీ చేశారు. వీటి విలువ దాదాపు రూ. 1 లక్ష వరకు ఉంటుంది. దీనిపై స్థానిక పోలీసులకు కంప్లయింట్ ఇవ్వగా.. పోలీసులు దొంగ కోసం వెతుకుతున్నారు. గత కొంత కాలంగా సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న టమాటా ధరలు రోజురోజుకు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.