Weight loss: ఈ కూరగాయలు ఈజీగా బరువు తగ్గిస్తాయి..!
బరువు తగ్గాలనుకునేవారికి వారి డైట్లో ఏం తీసుకోవాలి, ఏం తినకూడదో తెలుసుకోవాలనే డౌట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. శరీరానికి పోషకాలు అందించేవి, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి సహాయపడే 5 క్యాలరీలు తక్కువగా ఉండే, పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ రోజుల్లో అధిక బరువు చాలా మందికి ఒక సమస్యగా మారిపోయింది. లైఫ్‌స్టైల్ మార్పుల వల్ల బరువు పెరిగి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి ఆరోగ్యం, చక్కటి శరీరాకృతిని పొందాలనే కోరికతో చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల విషయంలో కచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు.
పాలకూర
పాలకూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఏ,సి, కె. వంటివి మెండుగా ఉంటాయి. అంతేకాదు, ఈ ఆకుకూరలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వంద గ్రాముల పాలకూరలో కేవలం 26 కేలరీలు ఉంటాయి. దీనిలో వాటర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మన డైట్లో చేర్చుకుంటే వెయిట్ లాస్‌కు సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, కె, జింక్, మెగ్నీషియం తోపాటుగా ఐరన్ శాతం కూడా ఎక్కువే. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.
క్యారెట్
వంద గ్రాముల క్యారెట్లో కేవలం 41 కేలరీలు ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటమే కాదు.. పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలోని బీటా కెరోటిన్, లుటీన్ వంటి పోషకాలు దృష్టిని ప్రోత్సహిస్తాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ డైట్లో క్యారెట్‌ను కచ్చితంగా తీసుకోండి.
కీరా
కీరాలో 100 గ్రాములకు కేవలం 15 కేలరీలు మాత్రమే ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరా దోస కూడా ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోలిస్ట్రాల్ ని కరిగించడానికి సహాయపడుతుంది.
క్యాబేజ్
బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజ్ మంచి ఆప్షన్. వంద గ్రాముల క్యాబేజీలో 24 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. క్యాబేజీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాబేజీలో ఇంసోల్యుబుల్ ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది. దీంతో ఆకలి వేయదు.. ఎక్కువగా తినకుండా ఉంటారు. అలాగే, ఇది శరీరాన్ని హైడ్రేట్ కూడా చేస్తుంది.