Australian Chef Gary Mehigan Kissing Huma Qureshi's video Gone viral
సెలబ్రిటీల పార్టీలలో అప్యాయంగా అలింగనం చేసుకొని బుగ్గలపై ముద్దుపెట్టడం అనేది ఇండస్ట్రీలో ఒక సాధారణ సాంప్రదాయమని అందరికి తెలిసిన విషయమే. అయితే హద్దులు మీరనంత వరకు బాగానే ఉంటుంది కానీ ఎవరైనా అతిచేస్తే మాత్రం సోషల్ మీడియా నుంచి చివాట్లు తప్పవు. ఈ మేరకు హాలీవుడ్ నటుడు గ్యారీ మైగన్(Gary Mehigan ), బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ(Huma Qureshi)ని ముద్దు పెట్టుకున్నారు. ఫలితంగా నెటిజనుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అదేంటి అంటారా..
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ తర్లా దలాల్ బయోపిక్(Tarla Dalal biopic) ఆధారంగా తెరకెక్కుతున్న తర్లా(Tarla) సినిమాలో నటించింది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్దమయింది. అందుకు చిత్ర యూనిట్ ముంబైలో ఓ భారీ సెలబ్రిటీ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జీ నటుడు గ్యారీ మైగన్(Gary Mehigan) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఖురేషీ, గ్యారీ ఇద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగి ఖురేషీ అనుమతి తీసుకొని బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు గ్యారీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజనులు స్పందిస్తూ.. బడా సెలబ్రిటీ అయినా సరే తోటి నటిని గౌరవించి అప్యాయంగా విష్ చేసినందుకు గ్యారీని మెచ్చుకుంటున్నారు.
గతంతో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, శిల్పా శెట్టిని స్టేజీ మీదనే ముద్దుపెట్టుకోవడం ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికి తెలిసిందే. గ్యాంగ్స్ ఆఫ్ వస్సెపూర్ చిత్రాలతో బాలీవుడ్ లో కి అడుగుపెట్టని ఢిల్లీ భామ ఆ తరువాత అనేక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఖురేషీ నటించిన తర్లా వెబ్ సిరీస్ విడులకు సిద్ధంగా ఉంది.