SRPT: ఎన్నికల ప్రశాంతత కోసం సూర్యాపేట జిల్లాలో నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉన్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, లౌడ్ స్పీకర్లు, ప్రచార సామాగ్రి వాడకంపై నిషేధం ఉంటుందని ఆయన తెలిపారు.